చిరంజీవి`150 కథ’ హైజాక్ !

(సెటైర్)

జంబులింగం తన ఇంటికొస్తున్నందుకు చిరంజీవి తెగ సంబరపడిపోతున్నాడు. జంబులింగం సినిమా రైటర్. ఈమధ్య అతగాడిచ్చిన కథలతో చిన్నాచితక హీరోలంతా సూపర్ స్టార్లయ్యారు. అంతేకాదు దర్శకుల వైభవం కూడా పెరిగిపోయింది. అయితేగియితే జంబులింగం రాసిన కథనే ఫైనల్ చేయాలని చిరంజీవి భావిస్తున్నట్టు అప్పటికే గాసిప్స్ రౌండ్ చుట్టేశాయ్.

అంతకుముందు ఒకడొచ్చి చిరంజీవికి కథ చెప్పాడు. ఫస్ట్ హాఫ్ బాగానేఉంది. సెకండ్ హాఫ్ చప్పగాఉంది. అదేమిటయ్యా అని అడిగితే, `ఇంటర్వెల్ దాకా కథబాగుంటే ప్రేక్షకుడు మళ్ళీ హాల్లోకి దూరడం ఖాయం. ఆ తర్వాత కథఎలాఉన్నా ఫర్వాలేదం’టూ అదో పద్ధతిగా మాట్లాడేశాడు. చిరంజీవికి చిర్రెత్తుకొచ్చింది. `150 చిత్రమంటే మాటలా.. కాదే. పైగా ఈమధ్య రాజకీయాలుగట్రా అంటూ తిరిగేస్తూ ముఖానికి రంగేసుకుని చాలోరోజులైంది. దీనికితోడు వయసు పెరుగుతుందేతప్ప, తగ్గదే. ఫ్యాన్స్ మాత్రం తమన్నా, సమంత, అనుష్కాలాంటి వాళ్లు హీరోయిన్లుగా ఉండాలని కోరుకుంటున్నారే.. కథ మాత్రం తేలడంలేదే..’ అనుకుంటున్న సమయంలోనే జంబులింగం తాను కథ రాసి పట్టుకొస్తున్నానని కబురుపంపాడు.

అందుకే చిరంజీవి తెగసంతోషపడిపోతున్నాడు. ఆ సంతోషంలో టివీ పెట్టుకుని న్యూస్ చూస్తున్నాడు. అంతే… కంగారుపడిపోయాడు అంతటి మెగాస్టార్.

టివీలో యాంకర్ చెప్పుకుపోతోంది…
`చిరంజీవి 150 చిత్రంకోసం రాసిన కథ ఇప్పుడు హైజాక్ కి గురైంది. ఈ కథ కూకట్ పల్లినుంచి ఫిల్మ్ నగర్ కి వస్తుండగా మార్గమధ్యంలో హైజాక్ కి గురైనట్టు తెలుస్తోంది. జంబులింగం ఈ కథను చాలా జాగ్రత్తగా పట్టుకువస్తున్నా, జంబులింగం ఎక్కిన కారుని హైజాక్ చేశారు కొంతమంది దుండగులు. ప్రస్తుతం హైజాక్ గురైన వాహనం నల్లమల అడవులవైపు వెళుతున్నట్టు తాజా సమాచారం’

జంబులింగాన్నీ, అతగాడు రాసిన కథను హైజాక్ చేయాల్సిన అవసరం ఎవరికొచ్చిందన్న విషయంపై టివీల్లో చర్చకార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. తెలుగుసినిమాలు చూసిచూసి విసుగుచెందిన కొంతమంది తీవ్రవాదులే జంబులింగాన్నీ, ఆయన రాసిన కథను హైజాక్ చేశారని కొన్ని ఛానెల్స్ పనిగట్టుకుని ప్రచారంచేస్తున్నాయి.

చిరంజీవి చాలా అసహనం ఫీలైపోయాడు. ఇంతమంది హీరోలుండగా తన 150 చిత్రకథనే ఎందుకు హైజాక్ చేయాల్సివచ్చిందో తెలియక తెగఇదైపోయాడు. తన సినిమా కథ ఇలా రెండడుగులు ముందుకీ, రెండడుగులు వెనక్కి వేయడంలోలాజిక్కేమిటో తెలియక సతమతమైపోతున్నాడు. ఇంతలో జంబులింగం వస్తున్నట్టు వార్త.

ఎలోగో తప్పించుకుని కథతోపాటుగా పరిగెత్తుకుంటూ వచ్చేశాడు జంబులింగం. చిరంజీవికి వెయ్యిఏనుగుల బలమొచ్చేసింది. జంబులింగం కథ చెప్పడం మొదలుపెట్టాడు.

`మన కథ పేరు సమాధి ప్రేమ’ అన్నాడు జంబులింగం.

చిరంజీవి ఆశ్చర్యపోయాడు. `ఏంటీ సమాధి ప్రేమా’

`అవును, సమాధి ప్రేమే. టైటిల్స్ అవగానే సమాధిలోనుంచి ఒక ఆకారం పైకిలేస్తుంది. పక్క సమాధులను తడుముకుంటూ పోతుంటుంది’

`ఏమిటయ్యా ఈ సమాధులగోల. నాకు ఆత్మల సబ్జెక్ట్ అంతగా బాగుండదు’ చిరంజీవి విసుక్కున్నాడు.

`తప్పదండీ, మీకు నచ్చకపోయినా ఇదే మీ 150వ చిత్రకథ’ శాసిస్తున్నట్టు అన్నాడు జంబులింగం.

`ఏమిటిది నాదగ్గరకే వచ్చి నన్నే శాసిస్తున్నావా, నేనెవరో తెలుసా… మాజీ మంత్రిని, కాంగ్రెస్ నాయకుణ్ణి…ఇంకా.. ఒక పార్టీ పెట్టినవాడ్ని….ఇంకా..’

`చూశారా మరి, ఎంతసేపటికీ రాజకీయవాసనేగాని నటజీవితం గురించి వాసనేలేదాయె. గతం గతః, మీకెందుకు మళ్ళీ సినిమాలు, అయినా తీయాలనుకుంటే, సమాధి ప్రేమ కథే మీకు కరెక్ట్’

ఈ మాటలతో చిరంజీవి కోపంతో ఊగిపోతూ…
`వీడేంటిలే రాజకీయాల్లోకి పోయాడు, పార్టీ జెండా పట్టుకున్నాడనుకున్నారా. అదే దమ్ము, అంతే స్పీడ్. నో డౌట్ . ఓసారి టర్నింగ్ ఇచ్చుకుంటే చాలు… అయినా నీకెంత ధైర్యం. నా వాసనలు, పూర్వవాసనల గురించి మాట్లాడటానికి…ఆఁ ‘

`అయ్యా, ఇది నా వాయిస్ కాదండయ్యా, నల్లమల అడవుల్లో జరిగిన సమావేశ తీర్మానమండయ్యా, ఆపై మీ ఇష్టం. కథ చెప్పమంటే చెబుతాను. లేదంటే నాదారిననేను పోతాను’

నాలుగురోజుల తర్వాత గిట్టని టివీ ఛానెల్ లో మరో న్యూస్….

`జంబులింగం రాసిన కథతో చంద్రబాబు తన కుమారుడు లోకేష్ చేత సినిమా తీయిస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ సినిమాలో బాలకృష్ణ ప్రత్యేకపాత్రలో కనబడతారని అంటున్నారు. చిరంజీవి 150 చిత్రకథను హైజాక్ చేయించడంలో బాబు హస్తం ఉన్నదని పిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. మొత్తానికి చిరంజీవికి 150వ చిత్రకథ మాత్రం ఇంకా ఫైనల్ కాలేదనే తెలుస్తోంది’

ఇంతలో మరో రైటర్ వెంగళప్ప కథరాసుకుని చిరంజీవిని కలుసుకోవడంకోసం కారెక్కాడు. మళ్ళీ మొదలు… వెంగళప్ప కోసం చిరంజీవి ఎదురుచూడటం…

-కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close