సెటైర్: మిత్రలాభం

(విష్ణుశర్మ లేఖ)

`చంద్ర’ద్వయానికి,

నేను విష్ణుశర్మని.. అంటే మీకు వెంటనే గుర్తుకురాకపోవచ్చు. పూర్వం రాకుమారులను దారిలో పెట్టడంకోసం `పంచతంత్రం’ పేరిట వారికి కథలు చెప్పాను. బహుశా ఇప్పుడు మీకు గుర్తువచ్చి ఉంటుంది. నేను సంస్కృతంలో రాసిన పంచత్రంతాన్ని తెలుగులో పరవస్తు చిన్నయసూరిగారు రాశారు. ఇప్పుడు గుర్తుపట్టారుకదా…ఎందుకంటే మీరు చదువుకునేరోజుల్లో పంచతంత్ర కథలు తెలుగువాచకాల్లో కనబడుతుండేవి.

ఇప్పుడు నేను మీకు సంయుక్తంగా ఈలేఖ రాయడానికి కారణమేమంటే, నేను `మరో పంచతంత్రం’ పేరిట గ్రంథరచనకు శ్రీకారం చుట్టాను. ప్రస్తుత సమాజంలోని మానవనైజానికి తగ్గట్టుగా నా కథలు ఉంటాయి. ముఖ్యంగా మిత్రలాభం, మిత్రబేధం వంటి కథలు రాద్దామనుకోగానే అంతా మీ గురించే చెబుతున్నారు. అయితే మిత్రలాభం, లేదంటే మిత్రబేధం పరిధిలోకి రావాల్సిందిపోయి మీరిద్దరూ రెండు కథలను పంచుకున్నారు. ఇదో విచిత్ర పరిస్థితి. ఈ లేఖ అందగానే మీ అంతరార్థమేమిటో తెలియజేయగలరు.

చంద్రబాబుకు తెలివి ఎక్కువ – అంటే – చంద్రశేఖర్ రావు తెలివి తక్కువాడని అర్థంకాదు. అలాగే, చంద్రశేఖర రావుకి దూకుడెక్కువ- అంటే – చంద్రబాబు మెతక మనిషని అర్థంకానేకాదు. ఇద్దరూ ఇద్దరే. మీరిద్దరూ చిన్నప్పుడు నా కథలు చదివినవారే. మిత్రబేధం తర్వాత మిత్రలాభం ప్రశస్తంగా ఉంటుందని మీరిప్పుడు రుజువుచేస్తున్నారు.

తెలుగురాష్ట్రం విడిపోగానే మీరిద్దరు చెరో రాష్ట్రానికి ముఖ్యమంత్రులయ్యారు. అయితే, తెలంగాణ ఉద్యమాన్ని రగల్చడంలో నువ్వు (కేసీఆర్), ఆంధ్రులందర్నీ నీ శత్రువులుగా చూశావు. తెలంగాణ ప్రజలు నిజమని నమ్మేశారు. తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రులు దోచుకున్నారని అన్నావు. `అవునుకదా…’అనుకున్నారు ప్రజలు. తెలుగు మన భాష కాదన్నావు. తెలంగాణ తల్లిని ప్రతిష్టించావు. జనం మురిసిపోయారు. సీఎం అయ్యాక కూడా చంద్రబాబుని దుమ్మెత్తిపోస్తూనే ఉన్నావు. పాతరపెడ్తానన్నావు. లఫంగి, లోఫర్…అంటూ ప్రేలావు. గట్టిగా అడిగితే ఇవి మా భాషలో తిట్లుకావంటూ అడ్డంగా వాదించావు. నిజంగా నువ్వు ఘనుడవి. ఏ మాట అంటే అవతలివాళ్లు రెచ్చిపోతారో, కృంగిపోతారో నీకు బాగా తెలుసు.

అయ్యా చంద్రబాబు, మీరు కూడా తక్కువేమీ తినలేదు. పైకి మెతగ్గాఉన్నా మాటకుమాట అనడంలో మీకుమీరేసాటి. కేసీఆర్ సవాల్ అంటే మీరు బస్తీమే సవాల్ అనే రకం. మీ ఇద్దరిమధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. దీంతో హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రులకు సంకటస్థితి వచ్చేసింది. ఈ ఆంధ్రోళ్లను వెళ్లగొడతాం, మా తెలంగాణ మేము ఏలుకుంటామన్నదాకా ప్రజల్లో వైషమ్యాలు పెరిగిపోయాయి.

రెండు సింహాలు వైరంతో పోరాడుతుంటే అడవిలో మిగతా జీవులు ప్రశాంతంగా జీవించగలవా? మీరిద్దరూ ఒకప్పుడు స్నేహితులే. మరి ఎవరు చిచ్చుపెట్టారో ఏమోగానీ, శత్రువులుగా మారిపోయారు. సరిగా ఆ సమయంలో నేను జోక్యం చేసుకోవాల్సివచ్చింది. మిత్రబేధం కంటే మిత్రలాభం వల్లనే ఉభయులకూ మేలు జరుగుతుందని చెప్పాలనిపించింది. అయితే ఎలా చెప్పగలను ? నేను ఆత్మను కదా… చరిత్ర పుటల్లో కలిసిపోయిన ప్రాణిని. అయినా మానవాళికి మంచి బోధించాలన్న నా పిచ్చినమ్మకం ఇంకా చావలేదు. అదే నా ఆత్మకు శక్తినిచ్చింది.

ఆ శక్తితో ఓ పెద్దాయనలో చక్కటి ఆలోచన రేకెత్తించగలిగాను. దాన్ని ఆయన అమలుపరిచారు. ఆ పెద్దాయన మరెవరో కాదు, నరసింహన్ . ఆయన మిమ్మల్ని ఇద్దరినీ పిలిచి మిత్రలాభం కథ చదివి వినిపించారు. మీలో పరివర్తనకు ప్రయత్నంచేశారు. దీనికి తోడు వెంకయ్యనాయుడనే `ఉభయ ప్రాంత మిత్రుడు’ మీమేలుగోరి కొన్ని సూచనలు చేశారు. చంద్రబాబు ముందుగానే అర్థం చేసుకున్నా నీకు (కేసీఆర్) అర్థంకావడానికి కొంత సమయం పట్టింది. విద్యార్థులంతా ఒకేలా ఉండరుకదా. ఇదీ అంతే. ఒక గురువుగా నా ప్రయత్నం ఇలా చేశాను. అది ఇప్పుడు మొగ్గతొడిగినందుకు చాలా సంతోషంగా ఉంది.

ఒకరినొకరు విందుకు ఆహ్వానించుకుంటున్నారు. ఒకరింటికి మరొకరు ఆహ్వాన పత్రికలు పట్టుకుని వెళుతున్నారు. దుశ్శాలువాలు కప్పించుకుంటున్నారు. రాజధాని అమరావతి నగర శంకుస్థాపన మహోత్సవానికి రమ్మనమని పిలవగానే తమరు (కేసీఆర్) హుందాగా వెళ్ళారు. అక్కడ మీ గౌరవానికి ఎలాంటి హాని కలగలేదు. పైగా శిలాఫలకంపై మీపేరు లిఖించారు. ఆ తర్వాత ఇప్పుడు ఆయుత చండీయాగానికి రమ్మనమంటూ మీరు, స్వయంగా విజయవాడవెళ్ళి – చంద్రబాబకు ఆహ్వానపత్రిక అందజేశారు. పైగా వారి ఇంట భోజనం చేశారు. ఆంధ్రా వంటకాలు రుచి బాగున్నాయంటూ మెచ్చుకున్నారు. కనకదుర్గమ్మకు మీరు ముక్కుపుడక కూడా ఇచ్చారు. ఇలాంటి అవకాశాలు ఇకముందుకూడా చాలానే వస్తాయి. కనకదుర్గమ్మ ప్లైఓవర్ కు మీకు మళ్ళీ పిలుపు రావచ్చు. ఆ తర్వాత మెట్రో రైలు ప్రాజెక్ట్ శంకుస్థాపన అనో, అవుటర్ రింగ్ రోడ్డు పునాది ఉత్సవమనో…ఇలా బాబు మిమ్మల్ని పిలుస్తూనే ఉంటారు. అలాగే కేసీఆర్ నువ్వు కూడా యాగాలు, యజ్ఞాలు చేసుకుంటూనో, పేదవారి ఇళ్ల గృహప్రవేశాలనో, బడా ప్రాజెక్టులకు శంకుస్థాపనలనో పిలవచ్చు. కాబట్టి ఈ పేరంటాళ్ల ఉత్సవాలు ఇంకా మూడేళ్లపాటు సాగించవచ్చు. ఇటు పెద్దమ్మదయ, అటు దుర్గమ్మ దయ ఉంటే మరో ఐదేళ్లు ఈ మైత్రీ బంధాన్ని మంగళగిరి చాంతాడులా సాగదీయవచ్చు. అయితే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ నా సందేహం తీరలేదు.

జంతువుల మీద, పిట్టలమీద, పుట్టలమీద ఎన్నో కథలు రాసిన నాకు మీ రాజకీయ తంత్రం సరిగా అర్థంకావడంలేదు. పచ్చగడ్డివేస్తే భగ్గుమనే మీరిద్దరూ ఇప్పుడింత సఖ్యతగా ఎలా ఉండగలుగుతున్నారు ? పెద్దలు చెప్పే మంచిమాటల వల్లనే అంటూ మాబోటివాళ్లను బురిడీ కొట్టించకండి. నిజం ఏమిటో చెప్పండి…?

కేసీఆర్ లేకపోతే రాష్ట్రం విడిపోదు. అలా విడిపోకపోతే కాంగ్రెస్ బలహీనపడదు. అదే జరక్కపోతే చంద్రబాబు గెలవడం కష్టం. అందుకే కేసీఆర్ అంటే చంద్రబాబుకు ఏదో ఒక మూల అభిమానమున్నదని అనుకుంటున్నారు. అలాగే, చంద్రబాబు తాను నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిని అవ్వాలన్న ప్లాన్ తోనే చాలా చాకచక్యంగా పావులుకదపడం వల్లనే పెద్ద రాష్ట్రం రెండు ముక్కలైందనీ కనుకనే కేసీఆర్ మఖ్యమంత్రి కాగలగిరాని అనుకుంటున్నారు. ఉభయుల ఆశయాలు తీరినతర్వాత పక్కింటి వంట గురించి ఆలోచించకుండా ఎవరి కుంపటి వారు చూసుకుంటేనే మేలని భావిస్తున్నారని చెబుతున్నారు. ఇంతకీ మీ రాజనీతి తంత్రమేమిటో ప్రజలకెవ్వరికీ అర్థంకాలేదు. మరి మీరు చెబితే, నా మరో పంచతంత్రం గ్రంథాన్ని పూర్తిచేస్తాను. త్వరలో మీ తంత్రం తెలియజేస్తారని ఆశిస్తున్నాను.

మీకు గురువుగాని గురువు
విష్ణుశర్మ (పంచతంత్ర గ్రంథకర్త)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close