సెటైర్: తమ్ముళ్లూ గట్టిగా చప్పట్లు కొట్టండి..

`తమ్ముళ్లూ మీరు చెప్పండి అవునా, కాదా…చెప్పండి తమ్ముళ్ళూ.. అవును అయితే గట్టిగా చప్పట్లు కొట్టండి ‘ అని బాబుగారూ మైకు పుచ్చుకుని అనగానే, తమ్ముళ్లంతా చప్పట్లు కొట్టారు.

బాబుగారిలో ఉత్సాహం కట్టలు త్రెంచుకుంది. ప్రసంగం కొనసాగిస్తూ…

`అదే మాదిరిగా మనమంతా ముందుకుపోదాం…’

అనగానే ఎదురుగా కూర్చున్న తమ్ముళ్లకు అర్థంకాలేదు. విషయమేమిటో చెప్పకుండా `అదే మాదిరిగా ముందుకుపోవడమే’మిటో వాళ్లకు తెలియలేదు. అయినా బాబుగారు ఏదో ముందుచూపుతో చెబుతున్నప్పుడు అడ్డం తగలడం మంచిదికాదని, `అలాగే, ముందుకుపోదాం’ అంటూ తలలూపారు.

`తమ్ముళ్లూ మీకు మీ అమ్మా,నాన్న పేర్లు తెలుసు. కానీ మీ ముత్తాత, ముత్తవ్వ పేర్లు తెలుసా? అని అడుగుతున్నాను’

తమ్ముళ్లు మరోసారి అయోమయం ఫేస్ పెట్టారు. తెలియదంటూ పెదవివిరిచారు.

`అదేమాదిరిగా చెబుతున్నాను, తమ్ముళ్లూ, మన పూర్వీకుల గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నేను బాగా స్టడీ చేస్తున్నాను. మన చరిత్ర , మన సంస్కృతి అర్థం చేసుకుంటున్నాను. మన రాష్ట్ర రాజధానికి అమరావతి అని పేరుపెట్టాం. ఇప్పుడు రాజమండ్రిని రాజమహేంద్రవరంగా మార్చేస్తున్నాం’

ఒక తమ్ముడివైపు చూస్తూ…

`తమ్ముడూ, నీకు నన్నయ తెలుసా ? నీకు రాజరాజనరేంద్రుడు తెలుసా? ఇంకా…’

వరుస ప్రశ్నలు రావడంతో పరీక్షహాల్లో కూర్చున్నట్టు ఫీలైపోయాడు సదరు తమ్ముడు.

`చూశారా, ఈ తమ్ముడికి తెలియదు.(అదోలా నవ్వుతూ) ఈ మధ్యనే మిత్రులు చెప్పారు. ఇంకో పక్కన, వెయ్యేళ్లు దాటినా రాజరాజనరేంద్రుడిని అంతా గుర్తుపెట్టుకున్నారని తెలిసింది, అదేమాదిరి మనం ముందుకుపోదాం. ముందుతరాల వాళ్లు గ్యారంటీగా తెలుసుకోవాలి, అందుకు ప్రయత్నం చేయాల్సి ఉంది… మనం బాగా చేశాం..’

మాటల మధ్య ఎక్కడో లింక్ లు జారిపోతున్నాయన్న విషయం మాత్రం క్రిందకూర్చున్న తమ్ముళ్లకు అర్థమవుతోంది. బాబుగారి ఆలోచన ఏమిటో, ఆ విజన్ ఏమిటో, ముందుచూపో, వెనక చూపో..తమ్ముళ్ల చిట్టి బుర్రలకు అర్థంకాక మరోసారి బుర్ర గోక్కున్నారు.

`అవునా,తమ్ముళ్లూ, మనం బ్రహ్మాండంగా ముందుకుపోతున్నాం. ఎంత ముందుకుపోయినా చరిత్ర మరచిపోకూడదు. వెనకటి రాజ్యాలు మళ్ళీ వస్తాయని మరువకూడదని తెలియజేస్తున్నా…’

తమ్ముళ్లకు మళ్ళీ అర్థంకాలేదు. వెనకటి రాజ్యమా…! వెనకటి రాజ్యమంటే… ఇలా అనుకుంటూ వాళ్లు వెంటనే అరచేయి చూసుకుని ఉలిక్కిపడ్డారు. అమ్మో మళ్ళీ హస్తం వస్తుందా ఏమిటీ? కంగారుపడ్డారు.

బాబు ఇంకా…`అలాంటి వారిని మనం గుర్తుచేసుకోవాలి. ఎన్నో విషయాల్లో ముందుకుపోదాం, వెనక్కివెనక్కి చూసుకుంటూ పోదాం… తమ్ముళ్లూ గట్టిగా చప్పట్లు కొట్టండి..’

ఇలా అనగానే ఇది మాత్రం తమకు సరిగా అర్థమైందనుకున్న తమ్ముళ్లు గట్టిగా, ఇంకాస్త గట్టిగా మరికాస్త గట్టిగా తప్పట్లు కొట్టారు. ఆ తప్పట్ల హోరులో బాబుగారి మాటలు కలసిపోతున్నాయి.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌డ‌న్ గా డ్రాప్ అయిన ద‌ర్శ‌కేంద్రుడు

`ఓం న‌మో వేంక‌టేశాయ‌` త‌ర‌వాత రాఘ‌వేంద్ర‌రావు మెగాఫోన్‌కి దూరం అయ్యారు. అదే ఆయ‌న చివ‌రి చిత్ర‌మ‌ని అప్ప‌ట్లోనే ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆ సినిమా ఫ్లాప్‌. ఓ పరాజ‌యంతో.. ఓ అద్భుత‌మైన కెరీర్‌కి...

అవ‌స‌రాల‌తో నాని?

న‌టుడిగా విభిన్న‌మైన మార్క్ సంపాదించుకున్నాడు అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌. ద‌ర్శ‌కుడిగానూ త‌న ప్ర‌త్యేక‌త చాటుకుంటూనే ఉన్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ని తీస్తూ... మంచి పేరే తెచ్చుకున్నాడు. ఊహ‌లు గుస‌గుస‌లాడే, జ్యో అత్యుతానంద చిత్రాలు...

బోయ‌పాటికి హీరోలు లేరా?

బోయ‌పాటి శ్రీ‌ను.. మాస్ ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుడు. హీరోకి ఆయ‌న ఇచ్చే ఎలివేష‌న్స్ ఇంకెవ్వ‌రూ ఇవ్వ‌రు. రాజ‌మౌళి త‌ర‌వాత ఎమోష‌న్స్ క్యారీ చేయ‌డం దిట్ట‌.. బోయ‌పాటే. కాక‌పోతే.. ఇవ‌న్నీ సినిమా హిట్ట‌యిన‌ప్పుడే. సినిమా...

దుబ్బాకలో కేసీఆర్ ప్రచారం ..!?

దుబ్బాక ఉపఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రచారానికి సిద్ధమవుతున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. లక్ష మెజార్టీని లక్ష్యంగా పెట్టుకున్నానని హరీష్ రావు చెబుతున్నారు. ఆ దిశగా ఆయన తనదైన శైలిలో వ్యూహం రచిస్తున్నారు. అయితే.....

HOT NEWS

[X] Close
[X] Close