ముందేవచ్చిన కృష్ణా పుష్కరాలు !

(సెటైర్)

వెంగళప్ప ఏదైనా వార్త వింటేచాలు, వెంటనే దాన్ని ఎవరికైనా చెప్పేదాకా కడుపుబ్బరం ఆగదు. ఈ వింత లక్షణానికి మందేమైనాఉందా? అని డాక్టర్ని అడిగితే, ఆయన నవ్వేస్తూ, ` ఈ లక్షణంఉన్నవారికి మంచి డిమాండ్ ఉందోయ్, ఇంకాస్త ముదిరితే నువ్వూ టివీలో జర్నలిస్ట్ గా జాయినవ్వచ్చం’టూ సలహాఇచ్చేశాడు. అప్పటినుంచి వెంగళప్ప మరీ రెచ్చిపోతున్నాడు. అలాంటి వెంగళప్ప ఒక వార్తను కక్కేయడానికి పరుగుపరుగున జంబులింగం దగ్గరకు వచ్చేశాడు.

`బావా, జంబులింగం…ఇది విన్నావా?’

`ఏంటిరా అది ?’ అడిగాడు జంబులింగం

`అదే, అంతా కృష్ణానది గురించే చెప్పుకుంటున్నారు’ అంటూ ఊపిరిపీల్చుకున్నాడు వెంగళప్ప.

`ఓస్, అంతేనా, చెప్పుకోరామరి. గో.కృనే ఇవ్వాళ్టి హాట్ న్యూస్’

`గో.కృనా, ఇదేంటి గురూజీ, కొత్త న్యూస్ ఛానలా ఏంటీ !’

`అదేరా, గోదావరి, కృష్ణానదుల సంగమం వార్త వినలేదా ?’

`బావా, ఏదిఏమైనా మన బాబు అసాధ్యుడు. అపర భగరీథుడే అనుకో…’ మెచ్చుకోలుగా అన్నాడు వెంగళప్ప.

`అంటే, బాబే భగరీథుడంటావా ఏంటీ కొంపదీసి ? !’

`అవును బావా, జనం అలాగే అనుకుంటున్నారు’

`అలా గట్టిగా అనేయకు, జగన్ ఒప్పుకోడు. అపర భగీరథుడు మా నాన్నగారే అంటూ ఆ గౌరవ పదవి మరొకరికి ఇస్తే ఊరుకోనంటూ యాత్రలు, దీక్షలు గట్రా చేసినా చేసేస్తాడు. సర్లే, ఇంతకీ నువ్వు తెచ్చిన ఆ వార్తేమిటో చెప్పి నీ కడుపుబ్బరం తగ్గించుకో…’ అన్నాడు జంబులింగం.

`అదే మరి నేను చెప్పబోతుంటే నువ్వు అడ్డుతగిలావ్, గోదావరి పుష్కరాల సంగతి తెలుసా నీకు?’ అడిగాడు వెంగళప్ప.

`బాగుందిరా చద్ది వార్త పట్టుకొచ్చి పైగా ఏమిటీ హడావుడి ? !’

`అదికాదు బావా, గోదావరి పుష్కరాలు వచ్చాయి, వెళ్లాయి. ఆ సంగతి నాకూ తెలుసు. ఎగతాళి వద్దు. ఇప్పుడు నేను కృష్ణాపుష్కరాల గురించి సంచలన వార్త విన్నాను. అది నీచెవిన పడేద్దామని…’

`కృష్ణా పుష్కరాలు ఇప్పుడెక్కడ్రా, వచ్చే ఏడాది ఆగస్టు 12న మొదలవుతాయట. అప్పుడుకాని పుష్కరుడనే పెద్దాయన కృష్ణానదిలోకి ప్రవేశించడు, తెలుసా..?’

`అక్కడే నువ్వు పప్పులో కాలేశావ్. ఇవ్వాళ చంద్రబాబుగారు గోదావరి నీటిని కృష్ణానదిలో కలిపేశారుగా… ఈ వార్త వినలేదా ? ‘

`విన్నాను, అయితే, నీ సెన్సేషనల్ వార్తకీ దీనికీ సంబందం ఏమిటీ !’

`ఆగుబావా ఆగు, నీకంతా తొందరే… గోదావరి నీళ్లొచ్చి కృష్ణానదిలో కలిస్తే , మరి గోదావరి నదిలో ఏడాదిపొడుగునా ఉండే పుష్కరుడు వచ్చి కృష్ణానదిలో కలిసినట్టేగా’ లాజికల్ గా ముడివిప్పాడు వెంగళప్ప.

`అవున్రోయ్ !, నా బుర్రకు తట్టలేదు. చంద్రబాబుగారు చేసిన పనితో పుష్కరుడు కూడా కృష్ణానదిలోకి వచ్చేసినట్లే సుమీ’

`అద్గదీ, మరి ఈ వెంగళప్ప అంటే వెర్రి వెంగళప్ప అనుకున్నావా, గోదావరి జలం కృష్ణానదిలో చేరడంతో గోదావరిలో ఉన్న పుష్కరుడు కూడా కృష్ణలోకి వచ్చేసినట్టేకదా. అంటే ఏంటన్నమాట.. బాబుగారు చేసిన పనితో 11నెలల ముందే కృష్ణా పుష్కరాలు మొదలైనట్టే కదా..’ లాజికల్ గా ట్విస్ట్ ఇచ్చాడు వెంగళప్ప.

`అవుననుకో… లాజిక్ బాగానే ఉంది. కానీ ఏమిటో ఇంకా అయోమయంగానే ఉందిరా. అయినా బాబు ఇలా ఎందుకు చేశాడంటావ్? కృష్ణాపుష్కరాలకు మనమింకా రెడీకాకముందే, ఇప్పుడే పుష్కరుడ్ని ఇలా కృష్ణలోకి ఎందుకు వదిలిపెట్టాడంటావ్?’

`అదేమరి, నీకూనాకూ తేడా. నువ్వేమో కలం అరిగేదాకా కథలు రాసుకుంటూ కూర్చుంటావాయె, లోకంపోకడ తెలియదాయె… బావోయ్, మరి నేనో, కాబోయే టివీ జర్నలిస్ట్ ని కదా. వార్తలను ఏరుకోవడంకాదూ, ఏకంగా పీక్కునే వస్తా..’

`సరే ఆపు నీ సోది. బాబుగారు ఇలా ఎందుకు చేశారో తెలిస్తే చెప్పిఏడు’ విసుక్కున్నాడు జంబులింగం.

`గోదావరి పుష్కరాల ప్రారంభంలో ఏం జరిగిందీ ? ‘

`ఏం జరిగిందీ…ఆఁ తొక్కిసలాట జరిగింది కదా…’

`బావో, నీకు మెమరీ బాగానే ఉందిసుమీ… రాజమండ్రిలో తొక్కిసలాట జరిగినప్పటి నుంచి బాబుగారి మనసుబాగోలేదు. కృష్ణా పుష్కరాలకు ఇలాంటివి జరగకుండా ఉండేందుకు వ్యూహకర్తలతో మాట్లాడితే వారో సలహా ఇచ్చారట.
ఈ ఏడాది పొడవునా గోదావరిలో ఉండే పుష్కరుడ్ని ఇప్పుడే కృష్ణానదికి తీసుకువస్తే, దాదాపు రెండేళ్లపాటు భక్తులు నిదానంగా కృష్ణా పుష్కర స్నానాలు చేస్తుంటారు. దీంతో ఒకేసారి ఘాట్ల దగ్గరకు వచ్చేయడాలూ, తొక్కిసలాటలుండవని చెప్పారు. ఈ మధ్య హైటెక్ నుంచి ఆధ్యాత్మికం వైపు మనసు మళ్ళించుకున్న బాబుగారు ఈ ఆలోచన భేషుగ్గా ఉందని వెంటనే ముహూర్తం పెట్టించి గోదావరి నీళ్లను కృష్ణమ్మలో కలిపేశారు’

`నువ్వు సామాన్యుడివి కావురా. బాబుగారు ఒకందుకు గోదావరి నీళ్లను కృష్ణలో కలిపితే, నదుల అనుసంధానమని ఆయన అనుకుంటుంటే, నువ్వేమో ఈ వార్తను పుష్కరుడితో ముడిపెట్టావు కదారా… ఓరేయ్, కచ్చితంగా టీవీల్లోకి వెళ్ళాల్సిన వాడివే. నువ్వు చెప్పే వార్తలతో నా బుర్ర చెడిపోతుంది. వెళ్లరా వెళ్లు…’ జంబులింగం విసుక్కున్నాడు.

`ఉండమన్నా ఉండను , ఇప్పుడే వెళ్ళి మరో వార్తను పీక్కొస్తాను. రెడీగా ఉండుబావా’ అంటూ వెంగళప్ప తుర్రుమన్నాడు.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close