సెటైర్ :ఉల్లి బహిరంగ లేఖ

ప్రియ మిత్రులారా…

నా పేరు ఉల్లి. పూర్తి పేరు పెద్ద ఉల్లి గడ్డ. నా గురించి తెలియనివారుండరు, తెల్లవారితే నాపేరు స్మరించుకోవాల్సిందే. వంటింట్లో ఏ వస్తువు ఒక పూట లేకపోయినా గడుస్తుందేమోగానీ, కూరల బుట్టలో నేను లేకపోతే మీ కూరలు, పప్పులు, దోసెలు, పెరుగు పచ్చళ్లు…అన్నీ చప్పగానే ఉంటాయి. వంటింట్లో నాది రాజభోగమే. తొరిగేటప్పుడు మిమ్మల్ని ఏడిపించినా నామీద మీరు కురిపించే ప్రేమకు మీ చేతుల్లో ఒదిగిపోతుంటాను, మీ నోటికి రుచులు అందిస్తాను. అలా మొదట్లో అందర్నీ ఏడిపించే నేనే ఇప్పుడు ఏడుపు ముఖం పెట్టాను. దుఃఖం పొంగుకొస్తోంది. వంటింట్లో నేను లేనిదే ఒక్క పూట గడవదని నాకు తెలుసు. కానీ మరి కొద్ది రోజుల్లోనే నేను మీకు కనబడటం గగన కుసుమమే అవుతుంది. ఎందుకో తెలుసా? నా ధర ఉన్నట్టుండి పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో సామాన్యులకు నేను ఉల్లిప్రేమను అదే నా ప్రేమను అంతగా ఎలా పంచగలను చెప్పండి?

మీకు తెలుసు, తల్లిచేయనిమేలు కూడా ఉల్లి చేస్తుందని. అంత పేరొచ్చిందినాకు. అనేక రోగాలకు నేనే దివ్యఔషధాన్ని. మీలో చాలామందికి నామీద కోపం కదూ…ఏందుకంటే నన్ను నిలువునా కోయగానే మీ కళ్లలో నీళ్లు వచ్చేస్తాయికదా అందుకని. అయితే, నిజానికి అందులో నా తప్పేమీలేదు, ఉల్లిపాయను కోయగానే అందులోని ఎంజైమ్ లుబయటకు వస్తుంది. వాటితోపాటుగా సల్ఫర్ గ్యాస్ కూడా వెదజల్లబడుతుంది. ఇదే మీ కళ్లకు చికాకు పరచి కంటినుండి నీరు తెప్పిస్తుంది. అలా కళ్ల నీరు రావడం వల్ల మీ కళ్లు బాగా శుభ్రపడతాయట తెలుసా. అంటే మీచేత ఏడ్పించినా మీకు మేలు చేస్తున్నాననేగా..

మీ శరీర ఆరోగ్య శుద్ధిలో నేను ఎంతో సాయపడుతుంటాను. అంతేనా, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంటాను. మీ గుండెను జాగ్రత్తగా చూసుకుంటాను. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంటాను. దంతక్షయాన్ని నివారిస్తాను. అంతేకాదండోయ్, బ్యాక్టీరియా నుంచి వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్స్, డయేరియా నుంచి కాపాడుతుంటాను. నాలో యాంటీబాక్టీరియల్ లక్షణాలు ఉండటంతో మీకు రక్షణకవచంగా ఉంటాను.

అలాంటి నన్ను మీచెంతకు నిండుగా చేరకుండా మధ్యదళారీలు అడ్డుకుంటున్నారు. మహారాష్ట్రలో టోకు ధరలు బాగా పెరిగాయి. ఎంతో తెలుసా… ఈ ఒక్క నెలలోనే 70 శాతం ఎక్కువ పెరిగాయి. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మళ్ళీ ఉల్లి సంక్షోభం రావడం ఖాయం. అదే నా భయం. మీరు చేసే పాడుపనులకు నాపేరిట సంక్షోభమంటూ పేరుపెట్టడమేమిటో నాకిప్పటికీ అర్థంకావడంలేదు. అయితే ఒకటి మాత్రం నిజం, నన్ను ఇబ్బంది పెడితే, నా మనసుకు కష్టం కలిగిస్తే ప్రభుత్వాలు కూలిపోతాయి. ఇది నా శాపం. ఉల్లిగడ్డేకదా అని చులకనా చూస్తే, పాలకుల కళ్లలో నీళ్లు తెప్పించేయగలను.

మీరు సామాన్యులు, మీకీ విషయాలు అర్థంకావు. నా చుట్టూ ఎన్నో రాజకీయాలున్నాయి. ఎవరికివారు నన్ను తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు. ఉల్లిగడ్డ ధరలు ఎప్పుడు ఆకాశానికి అంటుతాయా…అని ప్రతిపక్షాలవాళ్లు ఎదురుచూస్తుంటారు. మీకో విషయం తెలుసా ? కేవలం ఉల్లి వ్యాపారం చేసుకున్నవారు తమ లాభాలతో కోట్లు సంపాదించుకుని పెద్దపెద్ద మేడలు కట్టేసుకున్నారు. ఇంకొంతమంది ఉల్లి వ్యాపారులు రాజకీయాల్లోకి చేరిపోయారు. `ఉల్లిపాయ వ్యాపారం చేసేవారు ఊర్లు ఏలుతారని’ ఎప్పుడో బ్రహ్మంగారు చెప్పారట. ఇప్పుడు అదే నిజమవుతుంది.

నన్ను మీరు అడ్డంగా కోసినా, నిలువుగా కోసినా, వేడివేడి పులుసులో పడేసినా, కాలే దోసపై వేసినా, సలసలాకాగే నూనె బాండీలో నన్ను నిర్దాక్షణ్యంగా పడేసి చిల్లుల గరిటెతో అటూఇటూ ఊపిరాడకుండా తిప్పేసినా, ఇంకా నరకంలో ఉండే శిక్షలన్నీ నాపై ప్రయోగించినా నేను మిమ్మల్ని ఎప్పుడైనా ఏమైనా అన్నానా… మీరు నాకు అన్నేసి శిక్షలు విధించినా నేను మాత్రం మీకు మేలు చేయాలనే అనుకుంటున్నానే… తల్లిచేసే మేలుకంటే నేనే ఎక్కువ మేలు చేస్తున్నానే… ఎల్లవేళలా మీకెప్పుడూ అందుబాటులోనే ఉండాలని మనసారా కోరుకుంటానే…. అలాంటి నన్ను ఇబ్బందిపెడతారా… నా దిగుబడి తగ్గడానికి ఎవరు కారణం? అనుకూల వాతావరణం సంగతి అటుంచండి. పాలకుల నిర్లక్ష్యం మాటేమిటీ అని అడుగుతున్నాను. ఇక మధ్యదళారుల మోసాల సంగతేమిటని ఈ బహిరంగ లేఖ ద్వారా మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. నాకు మెరుగైన పరిస్థితి తీసుకురావడంలో మీరంతా ఉద్యమించాలని కోరుతున్నాను.

మీకు నేను దూరమయ్యే పరిస్థితి మళ్ళీ వస్తుందేమోనన్న దిగులేస్తోంది. అదే నా బాధ. ఇప్పటికైనా మేలుకుని పరిస్థితిని సరిదిద్దుకోండి. నాకు ఊరట కలిగించండి. మరి ఉంటాను.
ఇట్లు
తల్లిప్రేమను మరిపించే మీ ఉల్లి.

– కణ్వస
kanvasa19@gmail.com

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జానీ మాస్ట‌ర్ కేస్‌: కొరియోగ్రాఫ‌ర్ల అత్య‌వ‌స‌ర మీటింగ్

కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ పై హ‌త్యాచార కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. ఓ మ‌హిళా కొరియోగ్రాఫ‌ర్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు నార్సింగ్ పోలీసులు జానీ మాస్ట‌ర్ పై విచార‌ణ చేప‌ట్టారు. అయితే జానీ...

రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో రండి చూసుకుందాం – రేవంత్ వార్నింగ్

ప్రపంచంతో భారత్ పోటీ పడుతుందంటే కారణం మజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసింది ఆయనేనని చెప్పుకొచ్చారు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని...

సుబ్రహ్మణ్య.. ఏదో గట్టి ప్లానే

రవిశంకర్ ఆల్ రౌండర్. యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, డైరెక్షన్ ఇలా పలు విభాగాల్లో ఆయనకి ప్రతిభ వుంది. ఇప్పుడు ఆయన తనయుడు అద్వాయ్ ని తెరకి పరిచయం చేస్తున్నారు. స్వయంగా రవిశంకర్ దర్శకత్వం...

మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తులా… రేవంత్ స‌ర్కార్ కు తెల్ల‌రేష‌న్ కార్డులిచ్చే ఆలోచ‌న ఉందా?

తెలంగాణ‌లో తెల్ల రేష‌న్ కార్డుల సంగ‌తి రేపు మా ఇంట్లో ల‌డ్డూల భోజ‌నం క‌థ‌లా మారింది. గ‌త ప‌ది సంవ‌త్స‌రాల్లో కొత్త కార్డుల కోసం ఎన్నో కుటుంబాలు ఎదురు చూశాయి. పెళ్లిళ్లు అయి,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close