పులివెందుల వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా జీవితాంతం రాజకీయాలు చేసి.. టీడీపీలో పక్కన పెట్టారని ఇప్పుడు వైసీపీలో చేరి టీడీపీని తిడుతున్న సతీష్ రెడ్డి తాజాగా ఓ భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. తనకు ఏమైనా జరిగితే దానికి కారణం లోకేష్, బీటెక్ రవిలేనని .. తన ప్రకటనను వాంగ్మూలంగా తీసుకోవాలని ఆయన వీడియో విడుదల చేశారు. తనపై దాడి జరుగుతుందని తనకు టీడీపీ నేతలు చెబుతున్నారని ఆయన అంటున్నారు.
అయితే ఎవరు దాడులు చేస్తారో సతీష్ రెడ్డికి తెలియనిదేం కాదు. ఆయన దశాబ్దాలుగా అక్కడ రాజకీయాలు చేశారు. మరి ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారో కానీ ముందుగా ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం టీడీపీ నేతలపై పడింది. ఆయన పులివెందులలో ఎలాంటి రాజకీయ ప్రభావం చూపించలేరు. అది వైఎస్ కుటుంబం నియంత్రంలో ఉన్న ప్రాంతం. అక్కడ సతీష్ రెడ్డిని టీడీపీ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు ఆయన ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు.. వైసీపీ నుంచి వచ్చిన స్క్రిప్టు ప్రకారం ఆయన ఇలా చెప్పి ఉంటే మాత్రం ఫుల్ డేంజర్ లో ఉన్నట్లే.
వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉండి తర్వాత బయటపడిన సతీష్ రెడ్డికి ఏదైనా ముప్పు ఉంటే.. ఆటు వైపు నుంచే ఉండాలి కానీ.. టీడీపీ నేతల నుంచి ఉండదు. ఇప్పుడు ఆయన చేసిన వీడియో కారణంగా.. ఆయన కేమైనా జరిగే టీడీపీ నేతల్నే అంటారు కాబట్టి.. అత్యధిక ముప్పు వైసీపీ క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న నేతల నుంచే ఉంటుంది. ఆయనకు ఏం కాకుండా.. టీడీపీ నేతలు చూసుకోవాల్సి ఉంది. ఒక వేళ ఏదైనా ఎటాక్ జరిగితే.. టీడీపీపై వేయడానికి వైసీపీ రెడీగా ఉంటుంది. అసలే తామే దాడి చేసి..తామే డ్రామాలాడించే రాజకీయాల్లో వైసీపీ నేతలు ఎక్స్పర్టులు.