సత్య ఇప్పుడు టాలీవుడ్లో టాప్ కమెడియన్. చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. చిన్న చిన్న క్యారెక్టర్ల వైపు చూడటం లేదు. పెద్ద ప్రొడక్షన్ ఉంటే చిన్న కామెడీ రోల్స్ చేస్తున్నాడు కానీ మంచి కథల కోసమే ఎదురుచూస్తున్నాడు. మత్తువదలరా సక్సెస్ సత్యకి మరింత ఫేం తీసుకొచ్చింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో కొత్త సినిమా స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రానికి రితేష్ రానా డైరెక్టర్. ఈసారి శ్రీ సింహ లేడు. సత్యనే సోలో హీరో.
మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో ఉంది. సత్యకు జోడిగా మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘ్ కనిపిస్తోంది. మత్తు వదలరా ఫ్రాంచైజీలో భాగమైన వెన్నెల కిషోర్, అజయ్ ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రితేష్ రానా గత సినిమాలకు పని చేసిన కాల భైరవ, సురేష్ సరంగం, కార్తిక శ్రీనివాస్ టెక్నికల్ టీంలో ఉన్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. మత్తు వదలరా క్రేజ్‌కి సత్య నటన ప్లస్ అయ్యింది. ఇప్పుడు సోలోగా సత్యతో రావడం ఖచ్చితంగా సినిమాపై మంచి అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది.