‘సవ్యసాచి’కి మిగతా సినిమాలతో పోటీ వద్దని…

ప్రస్తుతం నాగచైతన్య, సమంత గోవాలో వున్నారు. మ్యాగ్జిమమ్ ఈ వీకెండ్‌కి అక్కడి నుంచి వచ్చేస్తారు. వచ్చాక రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకొని ‘సవ్యసాచి’లో చివరి పాట షూటింగ్ కోసం నాగచైతన్య విదేశాలు వెళ్తారు. మహా అయితే మూడు నాలుగు రోజుల్లో షూటింగ్ కానిచ్చేస్తారు. పాటతో సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి కొంచెం టైమ్ పడుతుంది. నిర్మాతలు చెప్పినదాని ప్రకారం చూసుకున్నా సెప్టెంబర్ 15కి పూర్తవుతుంది. ఆ తరవాత సినిమా విడుదల చేయాలంటే చేసుకోవచ్చు. అయితే సెప్టెంబర్ చివర్లో నాగార్జున ఒక హీరోగా నటించిన ‘దేవదాస్’ వస్తుంది. అది వచ్చిన రెండు మూడు వారాలకు విడుదల చేద్దామంటే అక్టోబర్‌లో విజయదశమి కానుకగా ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీరరాఘవ’ లైనులో వుంది. రామ్ ‘హలో గురూ ప్రేమ కోసమే’, విశాల్ ‘పందెం కోడి 2’ కూడా అక్టోబర్‌లో రిలీజ్ డేట్స్‌పై కర్చీఫ్ వేశాయి. ‘సవ్యసాచి’కి మిగతా సినిమాలతో పోటీ ఎందుకని ఏకంగా విడుదల తేదీని నవంబర్‌కి రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేశారు. నవంబర్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్‌లో ‘సవ్యసాచి’ని విడుదల చేయాలని భావిస్తున్నారు.

పాపం… ‘సవ్యసాచి’ సినిమా ఓ ముహూర్తాన మొదలైందో కానీ ఏదీ కలసి రావడం లేదు. మొదట్లో మాధవన్‌కి షోల్డర్ ఇంజ్యూరీ కావడంతో కొన్ని రోజులు షూటింగ్ వాయిదా పడింది. తరవాత గ్రాఫిక్ వర్క్ కోసం తీసిన సీన్లు బాగోలేదని, ఇంకొకటని రీషూట్లు చేయడంతో ఇంకొంత ఆలస్యం అయ్యింది. కిందామీదా పడి షూటింగ్ కంప్లీట్ చేసి సినిమా విడుదలకు సిద్ధం చేద్దామంటే ‘శైలజారెడ్డి అల్లుడు’ అడ్డు పడ్డాడు. చివరికి, షూటింగ్ కంప్లీట్ అయ్యే సమయానికి మిగతా సినిమాలు వున్నాయి. దాంతో మరింత వెనక్కి వెళ్లి నవంబర్ నెలలో సినిమాని విడుదల చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వీడు మామూలోడు కాదు..! ఏకంగా లంచం కోటి..!

అవినీతిని అరికట్టేందుకు రూ. 2వేల నోట్లను కేంద్రం నియంత్రించేసింది కానీ.. అదేమీ ఈ తరహా సంపాదనకు అలవాటు పడిన వారికి అడ్డం కాలేదు. రూ. 2వేల నోట్లు కాకపోతే.. రూ. ఐదు వందల...

షాకింగ్ : హైకోర్టు జడ్జిల ఫోన్ల ట్యాపింగ్..!?

ఆంధ్రప్రదేశ్‌లో అవాంఛనీయమైన పరిణామాలు రోజు రోజుకు వెలుగు చూస్తున్నాయి. అక్కడ న్యాయవ్యవస్థ విశ్వసనీయతపై దెబ్బ కొట్టేందుకు భారీ కుట్రలు జరుగుతున్నాయని మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య ఫోన్ సంభాషణతో వెల్లడయింది. తాజాగా ఇప్పుడు.. న్యాయమూర్తుల...

విశాఖలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కాదు ఓటు బ్యాంకుకు ఇళ్ల స్థలాలు..!

ఆంధ్రప్రదేశ్‌కు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నంను చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న ప్రభుత్వం... దానికి తగ్గట్లుగా "లుక్" ఉండే ప్రాజెక్టులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి రద్దు చేసుకుంటూ పోతోంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను క్యాన్సిల్ చేస్తోంది. ఓ...

ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి విషమం..!

గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని .. చెన్నైలో ఆయన చికిత్స పొందుతున్న ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయనను ఐసీయూలోకి షిఫ్ట్ చేశామని .. లైఫ్ సపోర్ట్...

HOT NEWS

[X] Close
[X] Close