జ‌గ‌న్ తో భేటీ.. షెడ్యూల్ ఇదే!

రేపు జ‌గ‌న్ తో టాలీవుడ్ ప్ర‌ముఖుల కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌బోతోంది. ఉద‌యం 10 గంట‌ల‌కు బేగంపేట విమానాశ్ర‌యంలో ప్ర‌త్యేక విమానం ద్వారా… టాలీవుడ్ బృందం విజ‌య‌వాడ బ‌య‌లుదేర‌నుంది. ఈ బృందంలో చిరంజీవి, నాగార్జున‌, ఎన్టీఆర్‌. మ‌హేష్‌, ప్ర‌భాస్‌, రాజ‌మౌళి, కొర‌టాల శివ త‌దిత‌ర ప్ర‌ముఖులు ఉండ‌బోతున్నారు. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో ఈ స‌మావేశం జ‌ర‌గ‌బోతోంది. ఆ త‌ర‌వాత సినీ ప్ర‌ముఖుల‌తో లంచ్ ఏర్పాటు చేశారు. 3 గంట‌ల‌కు టాలీవుడ్ బృందం తిరుగు ప్ర‌యాణం అవుతుంది. స‌మావేశం గంట‌లోపే ముగియ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే.. క‌మిటీ ప్ర‌భుత్వానికి ఓ నివేదిక సమ‌ర్పించింది. టికెట్ రేట్లు ఎలా ఉండ‌బోతున్నాయ‌న్న విష‌యంలో టాలీవుడ్ కి ఇప్ప‌టికే లీకేజీలు అందేశాయి. ఆ నివేదిక‌లో రేట్ల‌తో సినీ పెద్ద‌లు సంతృప్తిగానే ఉన్న‌ట్టు స‌మాచారం. దాంతో.. పెద్ద‌గా చ‌ర్చ‌లేం లేకుండానే.. నివేదిక‌లో ఉన్న రేట్ల‌కు టాలీవుడ్ పెద్ద‌లు స‌మ్మ‌తం తెలిపే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close