యుగాంతానికి డేట్ ఫిక్స్ అయిందా? ప్రపంచం అంతరించేందుకు ఆల్రెడీ కౌంట్ డౌన్ మొదలైందా? భూమి వైపు ఓ భారీ గ్రహశకలం దూసుకొస్తున్న నేపథ్యంలో జరుగుతున్న ప్రపంచవ్యాప్తంగా జరుగుతూన్న చర్చ ఇదే. కొంతమంది సైంటిస్టులు కూడా యుగాంతం జరిగే చాన్స్ ఉందని స్పష్టం చేస్తున్నారు.
భూమి వైపు 2003H4అనే గ్రహశకలం అత్యంత వేగంగా దూసుకువస్తోంది . ఎంతలా అంటే ఆ గ్రహశకలం చిన్న డ్యాష్ కనుక ఇస్తే భూమి తునాతునకలు అయ్యే రేంజ్ లో వచ్చేస్తోంది. 100అంతస్తుల భవనం అంత ఎత్తు ఉండటంతోపాటు గంటకు 50వేల కిలోమీటర్ల వేగంతో ఈ గ్రహశకలం భూమి వైపు దూసుకువస్తోంది. అయితే ,అంతపెద్ద గ్రహశకలం భూమివైపు రావడానికి మరెంతో దూరం లేదు. మే 24న భూమిని సమీపించనుందని సైంటిస్టులు తేల్చేశారు. సాయంత్రం 4గంటల7 నిమిషాల సమయంలో భూమికి పెను ప్రమాదం ఉండొచ్చునని చెప్పారు.
అయితే, 2003H4 అనే గ్రహశకలం మే24న భూమికి అత్యంత సమీపంగా వెళ్తుందని , కాకపోతే ఆ భూమిని డీకొట్టే అవకాశం లేదని నాసా చెబుతోంది. భూమి సమీపించే సమయంలో ఆకాశం మరింత ప్రకాశవంతంగా మెరుస్తుందని వెల్లడించింది. అయితే, ప్రమాదం జరగదని కూడా చెప్పలేమని అంటున్నారు సైంటిస్టులు. భూమికి అత్యంత సమీపంగా వచ్చిన నేపథ్యంలో భూమ్యక్షరణ వలన ఆ గ్రహశకలం గతి మారి, భూమిని డీకొట్టే అవకాశాన్ని కొట్టిపారయలేమని చెబుతున్నారు. అందుకే మే 24న సాయంత్రం అలర్ట్ గా ఉండాలని హెచ్చరిస్తున్నారు.