సింగర్ సుచిత్ర. చాలా హిట్ సాంగ్స్ పాడింది. అయితే మహేష్ బాబు బిజినెస్ మెన్ ‘సారొచ్చారు’ పాట మాత్రం ఆమెకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఈ పాటకు స్టేజ్ పైన ఆమె లైవ్ లో డ్యాన్స్ చేయడం ఇంకా ఆకట్టుకుంది. దిని తర్వాత ఆమెను ‘సారొచ్చారు’ సుచిత్రగా గుర్తుపెట్టుకున్నారు ఆడియన్స్. అలాంటి సుచిత్ర గత కొద్దిరోజులుగా వివాదంలో నలుగుతోంది. తమిళ హీరోలు ధనుష్, శింబు తనతో దురుసుగా ప్రవర్తించారని, వారు తన చేతిపై చేసిన గాయాల ఫోటోలను కొన్ని ఆమె తన ట్విట్టర్ లో పోస్ట్ చేయడం సంచలనం రేపింది. అయితే ఆ కొద్దిసేపటికే సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని, ధనుష్, శింబులపై ఆరోపణలు అబద్ధమని క్లారిటీ ఇచ్చారు ఆమె భర్త కార్తిక్.
ఇది ఇంకా వార్తల్లో వుండగానే సుచిత్ర ట్విట్టర్ నుండి మరో బాంబ్ పేల్చింది. హీరో ధనుష్, త్రిష, సంగీత దర్శకుడు అనిరుధ్, ఆండ్రియా, తాప్సీ, హన్సికల రోమాన్స్.. అంటూ కొన్ని ప్రైవేట్ పార్టీ ఫోటోలను ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది సుచిత్ర. అక్కడితో ఊరుకోలేదు. ధనుష్ రోమాన్స్, అనిరుధ్ రోమాన్స్, ఇది తాప్సి, అంటూ ఒక్కో ఫోటో కింది కామెంట్ రాసింది. అయితే ఆ కొద్దిసేపటికే మరోసారి తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని, ఆ ఫోటోలను తను పోస్ట్ చేయలేదని మళ్ళీ వివరణ ఇచ్చుకుంది. వెంటంటే ఆ ఫోటోలను అకౌంట్ నుండి డిలీట్ చేసింది. అయితే ఈలోగే సదరు ఫోటోలు వైరల్ అయిపోయాయి. ఈ ఫోటోలు అన్ సీన్ గానే వున్నాయి. ఇవి ఎక్కడి నుండి వచ్చాయో కానీ ఇప్పుడు ఈ విషయంలో పెద్ద రచ్చ జరుగుతోంది. జనరల్ గా కామ్ తన పని తను చేసుకుపోయే సుచిత్ర ఇలా ఇప్పుడు ట్విట్టర్ వేదికగా వివాదంలో పడటం హాట్ టాపిక్ అయ్యింది. ఈ వివాదం వెనుక సమ్ థింగ్ సమ్ థింగ్ ఏదో వుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.