“తెనాలి” కూడా కనిపించని పొత్తుల్లో పంపిణీ అయిపోయిందా..?

జనసేన పార్టీలో.. స్పీకర్‌గా చేసి.. ఓ స్టేచర్ ఉన్న నాదెండ్ల మనోహర్ లాంటి నేత చేరడం.. ఇదే మొదటి సారి. ఇప్పటి వరకూ జనసేనలో పవన్ కల్యాణ్.. తప్ప.. మరో నేత కనిపించేవారు కాదు. కానీ ఇప్పుడు నాదెండ్ల మనోహర్ అనే నేత కూడా కనిపిస్తారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. అంతో .. ఇంతో సొంత నియోజకవర్గంలో అనుచరగణం ఉందనుకుంటున్న…నాదెండ్ల మనోహర్ ఏ ధైర్యంతో జనసేనలో చేరారు..?. జనసేనలో చేరడానికి కూడా… మూడు నెలల నుంచి విస్తృతంగా సంప్రదింపులు జరిపామని.. గత వారం రోజులుగా.. మేథోమథనం జరిపామని… నాదెండ్ల మనోహర్ చెబుతున్నారు. పార్టీలో చేరడానికి అంత కసరత్తు ఎందుకు జరిగిందన్నది చాలా మందికి అర్థం కాలేదు. కానీ.. ఏపీ రాజకీయాలను సమగ్రంగా విశ్లేషిస్తే మాత్రం… అసలు లోగుట్టు బయటపడే అవకాశం ఉందనేది రాజకీయవర్గాల అంచనా.

వచ్చే ఎన్నికల్లో జనసేన, వైసీపీలను కలిపి పోటీ చేయించాలనేది బీజేపీ వ్యూహం. తెర వెనుక బీజేపీ ఉంటుంది. దానికి సంబంధించి తెర వెనుక చాలా పవర్ ఫుల్ శక్తులే… టాస్క్ తీసుకున్నారని ఇప్పటికే ఏపీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లుగానే.. రెండు పార్టీల వైపు నుంచి ఇప్పుడిప్పుడే సిగ్నల్స్ వస్తున్నాయి. బీజేపీకి కొన్ని సీట్లు.. జనసేనకు కొన్ని సీట్లు క్లియర్ చేస్తూ.. జగన్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఇప్పటికే కన్నా కోసం… లైన్ క్లియర్ చేశారని.. అడ్డుగా ఉన్న అప్పిరెడ్డిని శంకరగిరి మాన్యాలు పట్టించేశారని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అదే గుంటూరు జిల్లాలో జనసేనకు… తెనాలి నియోజకవర్గం కట్టబెట్టినట్లు.. నాదెండ్ల మనోహర్ చేరికతో క్లారిటీ వచ్చిందని..ఈ వ్యవహారాల్ని డీప్‌గా పరిశీలిస్తున్న వారికి క్లారిటీ వచ్చేసింది. అంతగా అవకాశం ఉంటే… నాదెండ్ల మనోహర్ కచ్చితంగా వైసీపీలోనే చేరి ఉండేవారు. ప్రస్తతం వైసీపీ తరపున ఇన్చార్జ్ గా ఉన్న అన్నాబత్తుని శ్రావణ్ కుమార్ ఆర్థిక పరిస్థితిపై జగన్ కు నమ్మకం లేదు. క్యాండేట్ లేకనే..ఆయన సైలెంట్‌గా ఉన్నారు. నాదెండ్ల వస్తానంటే చేర్చుకుని ఉండేవారే. కానీ… అన్ని సమీకరణాలు మూడు నెలల పాటు చూసిన తర్వాతనే… నాదెండ్ల. ..జనసేన గూటికి చేరారు. అంటే.. గుంటూరు పశ్చిమలో.. బీజేపీ, తెనాలిలో జనసేనకు కూటమి తరపున సీట్లు కన్ఫర్మ్ అయ్యాయని అనుకోవచ్చు.

పొత్తులపై.. పవన్ కల్యాణ్ టోన్ కూడా.. అనూహ్యంగా మారిపోయింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు..మిత్రులు ఉండరంటూ.. కొత్త లాంగ్వేజ్‌ను ఉపయోగిస్తున్నారు. నిన్నామొన్నటిదాకా… 175 స్థానాల్లో పోటీ చేస్తానని… బిగ్గరగా.. పదే పదే అరచి చెప్పి.. ఇప్పుడు కొత్తగా… పొత్తులపై సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు. తెర వెనుక చాలా పెద్ద పొత్తుల వ్యవహారమే నడుస్తోందని.. సులువుగా అర్థం అవుతోందని… రాజకీయవర్గాల అంచనా. పరిస్థితులు చూస్తూంటే.. కొట్టి పారేయలేం..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close