సచివాలయ ఉద్యోగ సంఘ ఎన్నికల్లో ఉద్యోగుల్లో వైసీపీ నేతగా చెలామణి అవుతున్న వెంకట్రామిరెడ్డి మద్దతుదారులు ఘోరపరాజయం పాలయ్యారు. వెంకట్రామిరెడ్డి పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఆయన రాజేశ్ అనే తన అనుచరుడ్ని అధ్యక్షుడిగా పోటీ పెట్టారు. కార్యవర్గంలో మొత్తం 9 పదవులకు ఎన్నికలు జరిగాయి. తన మద్దతుదారుల ప్యానెల్‌ను నిలబెట్టారు. అయితే అధ్యక్షుడు సహా కార్యవర్గంలో ఏడుగురు ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసిన వారే గెలిచారు.
ప్రధాన కార్యదర్శిగా నాతా ప్రసాద్ .. గెలిచారు. ఆయన వెంకట్రామిరెడ్డి మద్దతుదారుల ప్యానల్ తరపున నిలబడ్డారు. ఆయన వ్యక్తిగతంగా సంపాదించిన ఓట్లతో..ఆరు ఓట్ల మెజార్టీతో గెలిచారు. అదనపు కార్యదర్శిగా లింగారెడ్డి గెలిచారు. వీరిద్దరూ తప్ప అందరూ రామకృష్ణ ప్యానల్ తరపున గెలిచారు. వైసీపీ గెలిచాక వెంకట్రామిరెడ్డిని సచివాలయ ఉద్యోగులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఆయన వైసీపీకి ఊడిగం చేశారు.
తన మద్దతుదారులకు అక్రమంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వంటివి ఇప్పించే ప్రయత్నం చేసి ఇతర ఉద్యోగులకు అన్యాయం చేశారు. అదే సమయంలో సర్వీస్ రూల్స్ ఉల్లంఘించి వైసీపీకి ప్రచారం చేసి బుక్కయ్యారు. ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు. ఆయనపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. సర్వీస్ నుంచి డిస్మిస్ చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది.