శేఖ‌ర్ క‌మ్ముల జోన‌ర్ మార్చాల‌ని అనుకుంటున్నాడా?

శేఖ‌ర్ క‌మ్ముల అన‌గానే ఓ ర‌క‌మైన సినిమాలు గుర్తొస్తాయి. ఆనంద్‌, గోదావ‌రి, హ్యాపీడేస్‌, ఫిదా.. ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాలే క‌ళ్ల‌ముందు మెదులుతాయి. త‌న‌పై కూడా అలాంటి ముద్రే ఉంది. ఫీల్ గుడ్ కి కేరాఫ్ అడ్ర‌స్స్ ఆయ‌న. ల‌వ్ స్టోరీ కూడా అలాంటి సినిమానే. అయితే ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల త‌న శైలి మారుద్దామ‌నుకుంటున్నాడ‌ట‌. త‌న‌పై ప‌డిన ఫీల్ గుడ్ ముద్ర‌ని చెరిపేసి కొత్త త‌ర‌హా సినిమా చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. త్వ‌ర‌లో ధ‌నుష్ తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. అది థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో న‌డుస్తుంది. ఈ విష‌యాన్ని శేఖ‌ర్ క‌మ్ముల‌నే చెప్పాడు. సో… శేఖ‌ర్ ఆ ప్ర‌య‌త్నాలు ప్రారంభించేశాడ‌న్న‌మాట‌.

నిజానికి శేఖ‌ర్ క‌మ్ముల `అనామిక‌`తోనే ఆ ప్ర‌య‌త్నం చేశాడు. ఈ సినిమా శేఖ‌ర్ క‌మ్ముల శైలిలో ఉండ‌దు. ఓ థ్రిల్ల‌ర్‌. ఎప్పుడూ రీమేకులు చేయ‌ని శేఖ‌ర్ క‌మ్ముల థ్రిల్ల‌ర్ చేయ‌డంలో ఉద్దేశ్యం అదే. అయితే అది వ‌ర్క‌వుట్ కాలేదు. కుటుంబ క‌థ‌లు, ప్రేమ‌క‌థ‌లూ చెప్పే శేఖ‌ర్ క‌మ్ముల `లీడ‌ర్‌`తో పొలిటిక‌ల్ డ్రామా ట‌చ్ చేశాడు. ఇది కూడా మార్పులో భాగ‌మే. కానీ.. ఎవ్వ‌రూ గుర్తించ‌లేదు. ఇప్పుడు ధ‌నుష్ సినిమాతో అయినా త‌న తాప‌త్ర‌యం, ప్ర‌య‌త్నం అర్థ‌మ‌వుతాయేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: ఒక‌టి క్లాస్, మ‌రోటి మాస్

ద‌స‌రా సీజ‌న్‌తో ఈ నెల ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ నెలంతా సినిమాల హ‌డావుడే. దీపావ‌ళి సీజ‌న్‌లో మ‌రిన్ని సినిమాలు రాబోతున్నాయి. ఈలోగా... కొత్త వారం వ‌చ్చేసింది. ఈ శుక్ర‌వారం కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర...

మీడియా వాచ్ : టీడీపీకి తలవంపులు తెస్తున్న ఏబీఎన్ యూ ట్యూబ్ చానల్ !

రాజకీయాల్లో ప్రత్యర్థి ఎప్పుడూ మేలే చేస్తాడు. ఎందుకంటే అతడు ప్రత్యర్థి నేరుగా తలపడతాడు. అతన్ని గెలవాలని పోరాడతారు. కానీ సపోర్ట్ చేస్తామని ముందుకొచ్చేవారితోనే అసలు ముప్పు ఉంటుంది. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా...

హరీష్‌కు ఆహ్వానం లేదు.. కవిత వెళ్లలేదు !

టీఆర్ఎస్ ప్లీనరీలో అంతా కేటీఆర్ షో నడిచింది. బయట మొత్తం ఫ్లెక్సీలు కేసీఆర్‌వి ఉంటే.. లోపల హడావుడి మొత్తం కేటీఆర్‌దే. ప్లీనరీలో ఆయనకు ప్రమోషన్ ఇస్తూ ఓ నిర్ణయం తీసుకున్నారు. అందుకే విపక్షాలు...

3 పథకాలు – ఒకే మీట .. అకౌంట్లలో డబ్బులు వేయనున్న జగన్ !

ఏపీ ప్రభుత్వ నగదు బదిలీ పథకాల్లో భాగంగా అక్టోబర్ క్యాలెండ్‌లో ఉన్న పథకాలకు నేడు సీఎం జగన్ మీట నొక్కి డబ్బులు విడుదల చేయనున్నారు. రైతుభరోసా పథకం కింద యాభై లక్షలకుపైబడిన...

HOT NEWS

[X] Close
[X] Close