చిరు డేట్ ని `లాక్‌` చేసిన రాజ‌శేఖ‌ర్‌

ఫిబ్ర‌వ‌రి 4న ఆచార్య రావాల్సివుంది. అయితే.. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` వాయిదా ప‌డ‌డంతో.. ఆ ప్ర‌భావం చిరంజీవి సినిమాపై ప‌డింది. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` వ‌చ్చాకే.. `ఆచార్య‌`ని విడుద‌ల చేయాల‌న్న‌ది ఆ రెండు సినిమాల మ‌ధ్య జ‌రిగిన లోపాయ‌కారి ఒప్పందం. సో.. `ఆచార్య‌` ఫిబ్ర‌వ‌రి 4న వ‌చ్చే అవ‌కాశాలు లేవు. ఆ డేట్ ని రాజ‌శేఖ‌ర్ త‌న `శేఖ‌ర్‌` కోసం లాక్ చేశారు. రాజ‌శేఖ‌ర్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌మిది. జీవితా రాజ‌శేఖ‌ర్ ద‌ర్శ‌కురాలు. ఈ సినిమాని సంక్రాంతికే విడుద‌ల చేద్దామ‌నుకున్నారు. కానీ హ‌డావుడి అయిపోవ‌డంతో… లాస్ట్ మినిట్ లో గంద‌ర గోళం ఎందుక‌ని చెప్పి, సంక్రాంతికి విడుద‌ల చేయ‌డం లేదు. ఇప్పుడు శేఖ‌ర్ టీమ్ దృష్టి ఫిబ్ర‌వ‌రి 4పై ప‌డింది. ఎలాగూ ఆచార్య రావ‌డం లేదు కాబ‌ట్టి.. ఆ డేట్ ఖాళీగా ఉంటుంది. పైగా ఫిబ్ర‌వ‌రి 4.. రాజ‌శేఖ‌ర్ పుట్టిన రోజు. అలా.. ఆ రోజు క‌లిసొస్తుంద‌ని `శేఖ‌ర్‌` టీమ్ భావిస్తోంది. జోసెఫ్ అనే సినిమాకి రీమేక్ ఇది. ఇటీవ‌లే టీజ‌ర్ వ‌చ్చింది. విజువ‌ల్స్ బాగున్నాయి. థ్రిల్ల‌ర్ సినిమాలు హిట్ అవుతున్న సీజ‌న్ ఇది. అందుకే ఓటీటీ నుంచి ఈ సినిమాకి మంచి ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ.. ఈ సినిమాని థియేట‌ర్ల‌ల‌లోనే విడుద‌ల చేయాల‌ని రాజ‌శేఖ‌ర్ ఫిక్స‌వ్వ‌డంతో… ఓటీటీకి ఇవ్వ‌లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close