వైసీపీలో సీనియర్ నేతలు బయటకు రావడం లేదని.. పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదని జగన్ ఫీల్ అవుతున్నారు. అందరూ ఇక నియోజకవర్గాల్లో పని చేసుకోవాలని అంటున్నారు. కానీ ఎవరూ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఉన్న వారంతా తప్పనిసరిగా వైసీపీలో ఉన్నారు. వైసీపీలో తప్ప ఇంకెక్కడా ఉండలేని.. ఉండకూడని విధంగా జగన్ వేసిన ట్రాప్ లో వారు పడ్డారు. అందుకే కిక్కురుమనకుండా ఉంటున్నారు. కానీ మంచి ఫ్లాట్ ఫాం దొరికితే వెళ్లిపోయి పాపాలు కడిగేసుకోవాలనుకుంటున్నారు.
ఇతర పార్టీల్లో చేర్చుకోరు !
వైసీపీ హయాంలో బూతులతో విరుచుకుపడని వైసీపీ కీలక నేత లేడు. ఎందుకంటే జగన్ రెడ్డి వేసిన ట్రాప్ అది. పదవులు ఇస్తున్నాం కాబట్టి తిట్టాల్సిందే అన్న ఫార్ములా అమలు చేశారు. అలా తిడితే ఇంకెప్పుడు ఆ పార్టీలోకి పోలేరనేది అసలైన ట్రాప్. జోగి రమేష్ నుంచి రోజా వరకూ అందరి కథ అదే. కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ ఇలా నోరున్నా నెతలంతా ఇప్పుడు కిక్కురుమనడం లేదు. అలాగని పార్టీని వదిలి పోవడం లేదు. ఎందుకంటే వారిని ఇతర పార్టీల్లో చేర్చుకోరు. అంతలా వారితో తిట్టించారు. అది జగన్ ట్రాప్ అని ఇప్పటికైనా వారికి అర్థమయిందో లేదో. అర్థమైనా చేసేదేం లేదు. వారికి వైసీపీ తప్ప మరో దారి లేదు.
బూతులు తిట్టించి వ్యక్తిగత శత్రువుల్ని సృష్టించిన జగన్
రాజకీయ ప్రత్యర్థుల్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టించి .. తమ నేతలకు రాజకీయం అంటే వ్యక్తిగత శత్రుత్వమే అన్నట్లుగా నేర్పించారు. ఫలితంగా వారు ఇప్పుడు టార్గెట్ అవుతున్నారు. చట్టపరంగానే చేసిన ఘోరమైన నేరాలకు బాధ్యత వహించి జైళ్లకు పోతున్నారు. జైళ్లకు వెళ్లకుండా తప్పించుకున్న వారు కూడా టెన్షన్స్ తో బతుకుతున్నారు. ఇప్పుడు వారికి రాజకీయంగానూ.. వ్యక్తిగతంనూ శత్రువులు ఉన్నారు. అయ్యో పాపం అనే వారు లేకుండా పోయారు. అందుకే వారికి జగన్ తప్ప మరో దిక్కు లేకుండా పోయింది.
జగన్ జైలుకెళ్తే మంచి ఫ్లాట్ ఫాం చూసుకుని జంప్
జగన్ జైలుకెళ్లడం కోసమే వీరందరూ ఎదురు చూస్తున్నారు. ఆ రోజు త్వరలోనే ఉందని.. అప్పుడు తాము అంతా ఓ ఫ్లాట్ ఫాం చూసుకుని జగన్ విష వలయం నుంచి బయటపడాలని అనుకుంటున్నారు. మళ్లీ బూతులతో విరుచుకుపడాలని.. సజ్జల ఆఫీస్ నుంచి వస్తున్న సూచనల్ని ఎవరూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇప్పటికే తమ కుటుంబాలను రోడ్డున పడేసుకున్నామని ఇప్పుడు కూడా అలా చేయలేమని వారు సమాధానం ఇస్తున్నారు. జగన్ త్వరలో జైలుకెళ్తారని అప్పుడు తమ దారి తాము చూసుకోవాలని ఎక్కువ మంది సీనియర్లు అనుకుంటున్నారు.