సుప్రీంకోర్టు జడ్జికి రూ. 160 కోట్లు లంచం.. ! గాలి గ్యాంగ్‌పై సంచలన వీడియో..!!

కర్ణాటక ఎన్నికల్లో పోలింగ్ కు రెండు రోజుల ముందు.. కన్నడ న్యూస్ చానల్ “బీ టీవీ” రాజకీయాల్లో సునామీ సృష్టించే వీడియోను బయటపెట్టింది. మైనింగ్ కేసులో సుప్రీంకోర్టులో ఉన్న కేసుకు సంబంధించి పర్మిషన్ ఇచ్చేందుకు రూ. 160 కోట్లు లంచం ఇచ్చేందుకు గాలి జనార్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు బి.శ్రీరాములు డీల్ కుదుర్చుకుంటూండటమే ఈ వీడియో సారాంశం. వీడియో, మాటలు అన్నీ స్పష్టంగా ఉండటంతో.. పోలింగ్ కు రెండు రోజుల ముందు బీజేపీ పరువు.. ఈవీఎంల ముందు పోగొట్టుకున్నట్లయింది.

ఈ వీడియో 2010లో రికార్డు చేసినట్లుగా భావిస్తున్నారు. వైఎస్ హయాంలో ఆంధ్రప్రదేశ్,కర్ణాటక సరిహద్దుల్ని చెల్లాచెదురు చేసి…ఐరన్ ఓర్‌ను విదేశాలకు తరలించి… వేల కోట్లు వెనకేసుకున్నారు. అప్పట్లో అడ్డుకున్న వారే లేరు. ఆ సొమ్ముతో వ్యవస్థలన్నిటినీ విచ్చలవిడిగా డబ్బుతో కొనేశారు. వైఎస్ మరణం తర్వాత కొంత మంది ధైర్యం చేసి కోర్టుల వరకూ వెళ్లారు. దాంతో 2010లో మైనింగ్ కు బ్రేక్ పడింది. వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఆగిపోయిన మైనింగ్ ను మళ్లీ ప్రారంభించుకునేలా సుప్రీంకోర్టు నుంచి నుంచి తీర్పు తెచ్చుకునేందుకు గాలి జనార్ధన్ రెడ్డి పరివారం చేసిన ఖర్చు రూ. 160 కోట్లు. సుప్రీంకోర్టు జస్టిస్ అల్లుడితో ఈ డీల్ కుదుర్చుకున్నారు. ఆ తర్వాత మైనింగ్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అప్పట్లో.. ఈ తీర్పుపై అనేక అనుమానాలు వ్యక్తమైనా…న్యాయవ్యవస్థపై గౌరవంతో ఎరూ నోరు మెదపలేకపోయారు.

కన్నడ టీవీ చానల్.. శ్రీరాములు నిర్వాకాన్ని నిర్విరామంగా ప్రసారం చేస్తోంది. రాష్ట్రాల సరిహద్దులను చెరిపి వేసి.. రూ. 50 వేల కోట్ల విలువైన ఖనిజ సంపదను విదేశాలకు తరలించినట్లు గాలి జనార్దన్ రెడ్డిపై కేసులు ఉన్నాయి. ఈ పరివారంలో.. బి.శ్రీరాములు నెంబర్ టూ. గతంలో… గాలి జనార్దన్ రెడ్డికి బెయిల కోసం.. హైదరాబాద్ లోని సీబీఐ న్యాయమూర్తికి కూడా లంచం ఇవ్వజూపిన కేసులో… శ్రీరాములు పేరు ఉంది. గాలి సోదరుడు సోమశేఖర్ రెడ్డి… ఈ కేసులో బెయిల్ పై బయట ఉన్నారు. ఈయన కూడా ఇప్పుడు బళ్లారి నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డికి సీబీఐతో క్లీన్ చిట్ ఇప్పించేందుకు బీజేపీ సిద్ధమయిందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే.. కర్ణాటక, తమిళనాడు, గోవా రాష్ట్రాల సీబీఐ అధికారులు ఆధారాలు లేవని కేసు క్లోజ్ చేశారు. హైదరాబాద్ సీబీఐ అధికారులు దాఖలు చేసిన కేసుపైనే విచారణ జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు దరఖాస్తు చేసుకున్నారు.. డీజీపీ పర్మిషన్ ఇచ్చారు..!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటనకు ఏపీ డీజీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మధ్యాహ్నం హోంమంత్రి సుచరిత చంద్రబాబు దరఖాస్తు చేసుకోలేదని మీడియాతో చెప్పడంతో... చంద్రబాబు పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే...

జగ్గారెడ్డి, టీవీ9 మీద ఈగ వాలనీయడం లేదుగా..

జగ్గారెడ్డి అంటే ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ నేత. అధికారంలో ఉన్న కెసిఆర్ , ఆయన కుటుంబ సభ్యుల మీద పదునైన విమర్శలు చేయడానికి విపక్ష నేతలు భయపడుతూ ఉన్న సమయంలో కూడా జగ్గారెడ్డి...

ఎల్జీ పాలిమర్స్‌ కేసులో ఆ వివరాలన్నీ చెప్పాలన్న హైకోర్టు..!

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై... హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై సుమోటోగా విచారణ చేయడంతో పాటు.. హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై .. విచారణ జరిపి... అనేక...

బాపట్ల ఎంపీ..మందడంలో భూమాయ..!?

కోర్టులపై సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్నాయి. రాజధాని తరలింపునకు బహిరంగంగా మద్దతు పలుకుతున్న నందిగం సురేష్.. సచివాలయం సమీపంలో ఉన్న ప్రభుత్వ...

HOT NEWS

[X] Close
[X] Close