లిక్కర్ స్కామ్ నిందితులు కోర్టులో, బయట వేస్తున్న డ్రామాల వెనకు ఉన్న నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫామ్ హౌస్లో పదకొండు కోట్ల రూపాయలు దొరికితే తమవి కాదని బుకాయిస్తున్నారు. కానీ గతంలో వారు తమ డెన్లలో డబ్బులు లెక్క పెడుతూ వీడియోలు చిత్రీకరించుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. చెవిరెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు ఫోన్లలోని వీడియోలు రిట్రీవ్ చేయడంతో డంప్ బయటపడింది.
శాంపిల్ గా ఓ వీడియో బయటకు వచ్చింది. అందులో వెంకటేష్ నాయుడు.. డబ్బుల కట్టల్ని లెక్క బెడుతున్న వీడియోలు ఉన్నాయి. డిస్టిలరీల నుంచి లంచాలు తీసుకుని వాటిని పంపాల్సిన వారి వద్దకు పంపే పనిని వెంకటేష్ నాయుడు చేశారు. అంతా చెవిరెడ్డి ఆదేశాలతోనే జరుగుతుంది. అసలు జరిగిన లావాదేవీలతో పోలిస్తే.. ఇది ఒక్క శాతం కూడా ఉండదు. ఐదు సంవత్సరాల పాటు ఇలాంటి ఇలాంటి డబ్బుల కట్టలతో డెన్ లను నడిపారు.
ఇంకా సంచలనాత్మకమైన వీడియోలు వెలుగులోకి రావాల్సి ఉంది. నాలుగు వందల కోట్ల రూపాయలతో కొన్ని బంగారం కూడా బయటకు రావాల్సి ఉంది. అవి దొరికి.. అసలు వీడియోలు వెలుగులోకి వస్తే.. లిక్కర్ పేరుతో ప్రజల రక్త మాంసాలను ఎలా పిండుకున్నారో ప్రజలకు స్పష్టత వస్తుంది.