ఈవారం బాక్సాఫీస్‌: 6న 7 సినిమాలు

ఈ శుక్ర‌వారం బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొంచెం హ‌డావుడి క‌నిపించింది. `తిమ్మ‌రుసు`, `ఇష్క్‌` ఈ రెండు సినిమాలూ ఒకేసారి విడుద‌ల కావ‌డంతో టాలీవుడ్ కి కాస్త ఊపొచ్చింది. ఈ సినిమాల టాక్‌, వ‌సూళ్లు ప‌క్క‌న పెడితే, టాలీవుడ్ కి ఇది క‌మింగ్ బ్యాక్‌. ఈవారం కూడా కొత్త సినిమాలు రాబోతున్నాయి. ఒక‌టి కాదు, రెండు కాదు.. ఏకంగా ఏడు సినిమాలు. ఆగ‌స్టు 6న స‌రిగ్గా ఏడు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధం అవుతున్నాయి. అయితే అవ‌న్నీ చిన్న సినిమాలే. అందులో కాస్త హైప్ ఉన్న సినిమా `ఎస్‌.ఆర్‌.క‌ల్యాణమండ‌పం`. ఈ సినిమాలోని పాట‌ల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ట్రైల‌ర్ కూడా బాగుండ‌డంతో… ఈ సినిమాపై ఫోక‌స్ ప‌డింది. వీటితో పాటు మ్యాడ్, ముగ్గురు మొనగాళ్లు, మెరిసే మెరిసే, క్షీర సాగ‌ర మ‌ధ‌నం, రావ‌ణ‌లంక‌, ఇప్పుడు కాక ఇంకెప్పుడు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. అయితే.. `క‌ల్యాణ‌మండ‌పం`కి త‌ప్ప‌.. దేనికీ స‌రైన ప్ర‌చారం లేదు. ఏపీలో ఇప్ప‌టికి స‌గం థియేట‌ర్లే తెరిచారు. 6 నుంచి ఏపీ థియేట‌ర్లు పూర్తిగా మూత‌బ‌డ‌తాయ‌ని, అక్క‌డ థియేట‌ర్లు తెర‌చుకునే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌ని ప్ర‌చారం సాగుతోంది. అంటే.. ఈ 7 సినిమాల టార్గెట్ తెలంగాణ మాత్ర‌మే అన్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కత్తి మహేష్ టెంప్లేట్ వైకాపా వదలదా? కత్తి స్థానాన్ని పోసాని భర్తీ చేయగలరా ?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైఎస్ఆర్సిపి మంత్రులు వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటూ చిన్న సైజు యుద్ధమే జరుగుతుంది. సినిమా టికెట్లను ప్రభుత్వ పోర్టల్ ద్వారా అమ్మాలి అన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పవన్...

పోసాని మళ్లీ రచ్చ – దాడికి ప్రయత్నించిన పవన్ ఫ్యాన్స్ !

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరోసారి మీడియా ముందుకు వచ్చిన పోసాని కృష్ణమురళి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం పెట్టి "పవన్ నీకెంత...

ప్రజల వరద కష్టాల కన్నా మీడియాకు సినిమా గొడవలే మిన్న !

ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో తుపాన్ బీభత్సం సృష్టించింది. ఏపీలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పటికీ తేరుకోలేదు. కొన్ని వందల గ్రామాల్లో అంధకారం అలుముకుంది. ఇక నష్టపోయిన వారి గురించిచెప్పాల్సిన...

పంజాబ్ కాంగ్రెస్ చిందర వందర !

అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదో చేద్దామని ప్రయత్నించిన కాంగ్రెస్ హైకమాండ్... పంజాబ్ లో పార్టీని చిందర వందర చేసుకుంది. సిద్దూకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి అందర్నీ కూల్ చేయాలనుకుంటే చివరికి అదే...

HOT NEWS

[X] Close
[X] Close