‘దిల్‌వాలే’ శాటిలైట్ రైట్స్ రు.60 కోట్లా!

హైదరాబాద్: షారుక్ ఖాన్, కాజల్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ జంటగా నటిస్తున్న ‘దిల్‌వాలే’ చిత్రం ఈ నెల 18న విడుదలకు సిద్ధమయింది. షారుక్ భార్య గౌరి ఈ చిత్రాన్ని ‘రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. యాక్షన్ చిత్రాలకు పేరుగాంచిన రోహిత్ షెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. షారుక్-రోహిత్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ విజయవంతమవటం, షారుక్-కాజోల్ హిట్ కాంబినేషన్ మళ్ళీ కుదరటం వంటి కారణాలతో ‘దిల్‌వాలే’కు విపరీతమైన క్రేజ్ వ్చచింది. శాటిలైట్ రైట్స్‌కోసం ప్రముఖ టీవీ ఛానల్స్ పోటీ పడగా మల్టీ స్క్రీన్ మీడియా సంస్థ రు.60 కోట్లకు దక్కించుకుంది. ఇండియాలో శాటిలైట్స్ రైట్స్ విషయంలో ఇదే అత్యధిక మొత్తం. ఇక ఆడియో రైట్స్‌ను సోనీ సంస్థ ఎప్పుడో రు.19 కోట్లు ఇచ్చి తీసేసుకుంది. ఇప్పటికే రు.79 కోట్లు వచ్చేశాయి. నిర్మాణ ఖర్చు రు. 100 కోట్లలో ముప్పావు భాగం వచ్చేసినట్లయింది. ఈ చిత్రం అత్యధిక శాతం రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. వరుణ్ ధావన్, కృతి సనన్ యువజంటగా నటించారు.

మరోవైపు ఈ చిత్రం విడులవుతున్న రోజే సంజయ్ లీలా భన్సాలీ రణవీర్ సింగ్, దీపికా పదుకోన్, ప్రియాంకచోప్రాలతో తీసిన భారీ చారిత్రక కథా చిత్రం ‘బాజీరావ్ మస్తానీ’ కూడా విడుదలవుతోంది. గతంలో కూడా సంజయ్ లీలా భన్సాలీకి, షారుక్‌కు పోటీ ఏర్పడింది. షారుక్ ‘ఓం శాంతి ఓం’, భన్సాలీ ‘సావరియా’ 2007 నవంబర్ 7న ఒకేరోజు విడుదలయ్యాయి. వీటిలో ఓం శాంతి ఓం హిట్ కాగా, సావరియా ఫ్లాప్ అయింది. మరి ఇప్పుడేమవుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వకీల్ సాబ్… వర్క్ మొద‌లైంది

క‌రోనా ఎఫెక్ట్, లాక్ డౌన్‌ల వ‌ల్ల షూటింగులు ఆగిపోయాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కూ ఆటంకం ఏర్ప‌డింది. అయితే కొన్ని సినిమాలు మాత్రం ధైర్యం చేస్తున్నాయి. వీలైనంత వ‌ర‌కూ సినిమాని సిద్ధం చేసే ప్ర‌య‌త్నాల్లో...

ఓటీటీలో రాజ‌మౌళి శిష్యుడి సినిమా

రాజ‌మౌళి శిష్యుడు అశ్విన్ గంగ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'ఆకాశ‌వాణి'. స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ధారి. ఈ సినిమా ఓ వెరైటీ కాన్సెప్టుతో తెర‌కెక్కుతోంది. నోరు లేని రేడియో... ఓ భ‌యంక‌ర‌మైన విల‌న్ పై...

పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన కేసులు కూడా ఎత్తేస్తారా..!?

ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు రాను రాను వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే దళితులపై పోలీసుల అరాచకాలు హైలెట్ అవుతూండగా.. తాజాగా..పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి.. పోలీసుల్ని కొట్టి విధ్వంసం సృష్టించిన కేసులను కూడా... ఎత్తేయాలని నిర్ణయించుకోవడం...

వైఎస్-చంద్రబాబు స్నేహంపై దేవాకట్టాకు కాపీరైట్ ఉందా..!?

నిర్మాత విష్ణు ఇందూరి - దర్శకుడు దేవా కట్ట మధ్య నాలుగు రోజుల కిందట.. సోషల్ మీడియాలో ప్రారంభమైన... వైఎస్ - చంద్రబాబు స్నేహం కథపై సినిమా వివాదం టీవీ చానళ్లకు ఎక్కింది....

HOT NEWS

[X] Close
[X] Close