శంక‌ర్ సినిమా: ట్రైన్ ఎపిసోడ్ అదిరిపోద్దంతే!

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ట్రైన్ ఎపిసోడ్ అంటే.. `న‌ర‌సింహ‌నాయుడు` చ‌టుక్కున గుర్తొస్తుంది. బాల‌కృష్ణ పౌరుషానికి మ‌ణిశర్మ బీజియం, బి.గోపాల్ టేకింగ్ ఇవ‌న్నీ ఆ సీన్‌ని, ఎమోష‌న్‌నీ ప‌తాక స్థాయిలో నిల‌బెట్టాయి. ఆ త‌ర‌వాత ఆ స్థాయిలో గూజ్‌బమ్స్ ఇచ్చిన ట్రైన్ ఎపిసోడ్ రాలేద‌నే చెప్పాలి.

అయితే ఇప్పుడు శంక‌ర్ సినిమాలో అలాంటి సీన్ ఒక‌టి ఉంద‌ట‌. రామ్ చ‌ర‌ణ్‌తో శంక‌ర్ ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఓ కీల‌క‌మైన ఘ‌ట్టంలో ట్రైన్ ఎపిసోడ్ వ‌స్తుంద‌ని స‌మాచారం. ఈ ఎపిసోడ్ లో రామ్ చ‌ర‌ణ్ హీరోయిజాన్ని ఓ స్థాయిలో ఆవిష్క‌రించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఈ సీన్ కోసం చాలా ఖర్చు పెట్టాల‌ని, ఎక్కువ రోజులు షూట్ చేయాల‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. ఇదో యాక్ష‌న్ ఘ‌ట్టం. వంద‌లాంది మంది ఫైట‌ర్లు అవ‌స‌ర‌మ‌ట‌. ఈ సినిమాలో ఈ ట్రైన్ ఫైట్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కాబోతోంద‌ని తెలుస్తోంది. అందుకోసం ఓసెట్ కూడా వేయాల్సివ‌స్తోంద‌ట‌. దాదాపు 200 కోట్ల ప్రాజెక్ట్ ఇది. ఆ బ‌డ్జెట్ రాను రాను పెర‌గొచ్చు కూడా. ఈ ట్రైన్ ఎపిసోడ్‌కే క‌నీసం ప‌ది కోట్ల‌యినా ఖర్చువుతంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. కియారా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అంజ‌లి, సునీల్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: ఒక‌టి క్లాస్, మ‌రోటి మాస్

ద‌స‌రా సీజ‌న్‌తో ఈ నెల ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ నెలంతా సినిమాల హ‌డావుడే. దీపావ‌ళి సీజ‌న్‌లో మ‌రిన్ని సినిమాలు రాబోతున్నాయి. ఈలోగా... కొత్త వారం వ‌చ్చేసింది. ఈ శుక్ర‌వారం కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర...

మీడియా వాచ్ : టీడీపీకి తలవంపులు తెస్తున్న ఏబీఎన్ యూ ట్యూబ్ చానల్ !

రాజకీయాల్లో ప్రత్యర్థి ఎప్పుడూ మేలే చేస్తాడు. ఎందుకంటే అతడు ప్రత్యర్థి నేరుగా తలపడతాడు. అతన్ని గెలవాలని పోరాడతారు. కానీ సపోర్ట్ చేస్తామని ముందుకొచ్చేవారితోనే అసలు ముప్పు ఉంటుంది. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా...

హరీష్‌కు ఆహ్వానం లేదు.. కవిత వెళ్లలేదు !

టీఆర్ఎస్ ప్లీనరీలో అంతా కేటీఆర్ షో నడిచింది. బయట మొత్తం ఫ్లెక్సీలు కేసీఆర్‌వి ఉంటే.. లోపల హడావుడి మొత్తం కేటీఆర్‌దే. ప్లీనరీలో ఆయనకు ప్రమోషన్ ఇస్తూ ఓ నిర్ణయం తీసుకున్నారు. అందుకే విపక్షాలు...

3 పథకాలు – ఒకే మీట .. అకౌంట్లలో డబ్బులు వేయనున్న జగన్ !

ఏపీ ప్రభుత్వ నగదు బదిలీ పథకాల్లో భాగంగా అక్టోబర్ క్యాలెండ్‌లో ఉన్న పథకాలకు నేడు సీఎం జగన్ మీట నొక్కి డబ్బులు విడుదల చేయనున్నారు. రైతుభరోసా పథకం కింద యాభై లక్షలకుపైబడిన...

HOT NEWS

[X] Close
[X] Close