‘భార‌తీయుడు 2’.. ఆగిపోలేదు!

శంక‌ర్ టైమ్ ఏమీ బాగాలేదు. అన్నీ వ‌రుస ఎదురు దెబ్బ‌లే. `భార‌తీయుడు 2` ఆగిపోయింది. ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్ష‌న్స్‌తో గొడ‌వ‌లు, కోర్టు కేసులు మొద‌ల‌య్యాయి. `అప‌రిచితుడు` మొద‌లెట్టిన రోజే.. మ‌రో షాక్ త‌గిలింది. నిర్మాత ర‌విచంద్ర‌న్ శంక‌ర్ పై నిప్పులు చెరిగారు. భార‌తీయుడు 2 పూర్త‌య్యేంత వ‌ర‌కూ.. రామ్ చ‌ర‌ణ్ సినిమాని ప‌ట్టాలెక్కించడం ఇప్పుడు క‌ష్టంగా మారింది. `అప‌రిచితుడు` హిందీ రీమేక్ మొద‌ల‌వుతుందో, లేదో ఇంకా తెలీదు.

అయితే.. ‘భార‌తీయుడు 2’ మాత్రం ఆగిపోలేద‌ట‌. ఈసినిమా త‌ప్ప‌కుండా పూర్త‌వుతుంద‌ని శంక‌ర్ చెబుతున్నారు. భార‌తీయుడు 2 పూర్తి చేశాకే.. శంక‌ర్ మిగిలిన సినిమాలు మొద‌లెట్టాల‌ని లైకా కోర్టుకెక్కిన సంగ‌తి తెలిసిందే. దీనిపై చెన్నై కోర్టులో వాద ప్ర‌తివాద‌న‌లు జ‌రుగుతున్నాయి. భార‌తీయుడు 2 సినిమా ఆగిపోలేద‌ని, ఆ సినిమా కోసం విదేశీ నిపుణులు రావాల్సి ఉంద‌ని, కోవిడ్ భ‌యాల‌తో.. వాళ్లు ఇండియాలో అడుగుపెట్ట‌డానికి భ‌య‌పెడుతున్నార‌ని, వాళ్లొచ్చాక‌… ఈ సినిమా షూటింగ్ య‌ధావిధిగా మొద‌ల‌వుతుంద‌ని శంక‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది కోర్టుకు చెప్పారు. జూన్ నుంచి.. కమ‌ల్ హాస‌న్ డేట్లు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని, ఆయ‌న ఓకే అంటే.. షూటింగ్ వెంట‌నే మొద‌లైపోతుంద‌ని శంక‌ర్ త‌ర‌పున న్యాయ‌వాది కోర్టుకు విన్న‌వించారు. ఇప్పుడు జూన్‌లో షూటింగ్ మొద‌లెట్ట‌డానికి.. లైకా నిర్మాత‌లు కూడా రెడీగా ఉన్నార‌ని స‌మాచారం. ఆ విదేశీ నిపుణుల్ని ర‌ప్పించే బాధ్య‌త కూడా శంక‌ర్ స్వ‌యంగా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. సో.. భార‌తీయుడు 2 మ‌ళ్లీ ప‌ట్టాలెక్కుతుంద‌న్న మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రమేష్ ఆస్పత్రికి రఘురామ..! హైకోర్టు ఆదేశాలనైనా పాటిస్తారా..?

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అయినా రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించకూడదనుకున్న సీఐడీ అధికారులు.. ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఐడీ కోర్టు ఆదేశించించినట్లుగానే.. రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించాలని స్పష్టం చేసింది. గుంంటూరు ప్రభుత్వాసుపత్రిలో...

జైలుకు ఆర్ఆర్ఆర్.. కోర్టును లైట్ తీసుకున్న సీఐడీ..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కోర్టులను లెక్క చేయలేదు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్యం అందించాలని ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేసి.. జిల్లా జైలుకు తరలించేశారు. ఆయనకు వైద్యం అందించే విషయంలోనే కాదు.. వైద్య నివేదిక...

టీవీ9 ప్రాథమిక నివేదిక.. ఆర్ఆర్ఆర్‌కి సొరియాసిస్..!

రఘురామకృష్ణరాజు కాళ్లకు ఉన్న దెబ్బల గురించి టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీ కోర్టు.. హైకోర్టులు ఆదేశించాయి. వైద్యులు నివేదికల కోసం.. కోర్టు ఇచ్చిన సమయం దాటి మరీ టెస్టులు చేస్తున్నారు. నివేదికలు...

రేవంత్‌కు పోలీసులే అలా ప్రచారం చేసి పెడతారు..!

హైదరాబాద్‌లో రూ. ఐదు రూపాయల భోజన కేంద్రాలయిన అన్నపూర్ణ క్యాంటీన్లు కొనసాగుతాయని మీడియాకు సమాచారం ఇచ్చిన తెలంగాణ సర్కార్.. నిజానికి ఆపేసింది. దాంతో పేదలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా చోట్ల టీఆర్ఎస్...

HOT NEWS

[X] Close
[X] Close