షర్మిల అసలు తగ్గట్లేదు. జగన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ పై ప్రజల్లో చర్చ జరుగుతోందని వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. నిజంగానే ప్రచారం జరుగుతోంది కానీ అదంతా కామెడీ తరహాలోనే. షర్మిల కూడా ఏకంగా జగన్ ను మావిగన్ జోకర్ అని తేల్చేశారు. ఇప్పుడు మరోసారి మీడియా ముందు సైటైర్లు వేశారు. మావిగన్ అంత గొప్పదైతే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదని షర్మిల ప్రశ్నించారు. మూడు ఊళ్ల పేర్లను పెట్టి మావిగన్ అని పెట్టిననట్లుగానే పులివెందులకు అవిగొడ్డలి అనిపేరు పెట్టాలని జగన్ కు సలహా ఇచ్చారు.
బొత్స సత్యనారాయణ ఏడ్చిన ఉదంతంపైనా షర్మిల స్పందించారు. బొత్స ఎందుకు ఏడ్చారో ఆయనకే తెలియాలన్నారు. వైఎస్ ను బొత్స అత్యంత ఘోరంగా తూలనాడారని గుర్తు చేశారు. అసెంబ్లీలో బొత్స ..వైఎస్ పై చేసిన వ్యాఖ్యలతో విజయమ్మ కంటతడి పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన వైఎస్ పై ఏదో అభిమానం ఉందన్నట్లుగా కంటతడి పెట్టుకోవడంపై షర్మిల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
షర్మిల జనగ్ పై పోరాటంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నారు. జగన్ పాలసీల విషయంలో ఘాటైన విమర్శలు చేస్తున్నారు. జగన్ రెడ్డి ప్రతి చిన్న అంశాన్ని రాసిస్తే తప్ప చదవలేరుకానీ.. షర్మిల అసవుగా విధానాలపై స్పందిస్తున్నారు. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆమెవిమర్శలు ఎంత సూటిగా వైసీపీని తగులుతున్నాయంటే.. మహిళా నేతల ట్విట్టర్ అకౌంట్లను తీసుకుని వారి పేరుతో ఘాటు ట్వీట్లు పెడుతున్నారు. అవన్నీ వైసీపీకి రివర్స్ అవుతున్నాయి.
