వైఎస్ షర్మిల చాలా పెద్ద ప్లాన్‌తోనే ఉన్నారు. తన కుమారుడు రాజారెడ్డికి పొలిటికల్ ట్రైనింగ్ ప్రారంభించారు. ఉల్లి రైతుల్ని పరామర్శించేందుకు కర్నూలు. వెళ్తున్న ఆమె కుమారుడిని కూడా తోడు తీుకెళ్లారు. ఇంటి వద్ద అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్న వైఎస్ రాజారెడ్డి తల్లితో పాటు బయలుదేరారు. రాజారెడ్డిని రాజశేఖర్ రెడ్డి అసలైన వారసుడిగా ప్రొజెక్ట్ చేసేందుకు షర్మిల గట్టి ప్రయత్నాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
రాజారెడ్డి గత ఏడాది విదేశాల్లో బైబిల్ యూనివర్శిటీలో చదువు పూర్తి చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తండ్రి అడుగు జాడల్లో క్రైస్తవ సమావేశాల్లో ప్రసంగిస్తున్న వీడియోలు అయ్యాయి. ఆయన కూడా అనిల్ కుమార్ లాగే పాస్టర్ అవుతాడని అనుకున్నారు. అయితే అది కేవలం భక్తి కోసమేనని.. రాజకీయాల్లో తన భవిష్యత్ చూసుకోవాలని ఆయన డిసైడయినట్లుగా తెలుస్తోంది. షర్మిల కూడా ఆ దిశగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
కొన్నాళ్ల పాటు క్షేత్ర స్థాయి రాజకీయ పరిస్థితులను ఆయనకు అర్థమయ్యేలా చేయడానికి షర్మిల తనతో పాటు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత అతనే నేరుగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్లాన్ చేయనున్నారు. ఎలా చూసినా.. షర్మిల వైఎస్ కుటుంబ రాజకీయ వారసత్వాన్ని తన కుమారుడికి దక్కేలా ప్లాన్ చేయనున్నారు. బ్రదర్ అనిల్ కుమార్ ఇటీవలి కాలంలో బయట కనిపించడం లేదు. ఆయన కూడా తన కుమారుడికే.. తమ వర్గం మద్దతు లభించేలా చేయడానికి తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు.