గోపీచంద్‌తో చేసిన విశ్వం సినిమాతో చాలా కాలం తర్వాత మళ్లీ యాక్టివ్ అయిన దర్శకుడు శ్రీను వైట్ల, ఆ సినిమా ఆశించిన సక్సెస్ కాకపోయినా తన కెరీర్లో మళ్లీ కదలిక వచ్చింది. ఇప్పుడు ఆయన మరో కొత్త ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. వైట్ల, నితిన్‌కి ఒక కథ చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు జరగలేదు. ఇప్పుడు అదే కథ శర్వానంద్ దగ్గరికి వెళ్లింది. ఆ కథకు శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ప్రస్తుతం శర్వా సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా, అభిలాష్ కంకర డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పుడు శ్రీను వైట్ల సినిమాను కూడా లైన్లో పెట్టారు. శ్రీను వైట్ల, శర్వానంద్ ఆసక్తికరమైన కాంబినేషనే. ఈ కథ వైట్ల మార్క్ వినోదంతో వుంటుంది. ఇప్పుడు శర్వా చేస్తున్న రెండు సినిమాలు కూడా సీరియస్ టోన్ లో వుంటాయి. అందుకు భిన్నంగా ఓ ఎంటర్టైనర్ చేయాలని భావించిన శర్వా, వైట్లతో జట్టుకడుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు.