ఇంట్లో హీరోలకు కొదవ లేకపోయినా… బయటి హీరోలతోనూ సినిమాలు చేస్తున్న సంస్థ గీతా ఆర్ట్స్. ఈమధ్య కాలంలో నాగచైతన్య, నాని లాంటి హీరోలకు హిట్లు ఇచ్చింది. ఇప్పుడు శర్వానంద్‌తో ఓ సినిమా చేయడానికి రంగం సిద్దం చేస్తున్నట్టు సమాచారం. అల్లు శిరీష్ కి ‘శ్రీరస్తు – శుభమస్తు’ సినిమాతో హిట్ ఇచ్చిన దర్శకుడు పరశురామ్. మళ్లీ గీతా ఆర్ట్స్‌లోనే ఓ సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ కథ సిద్దమైంది. ఇప్పటికి నానికి వినిపిస్తే.. ”చేతిలో నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి” అంటూ సైడ్ అయిపోయాడు. ఇప్పుడు ఈ కథ శర్వానంద్ దగ్గరకు వెళ్లింది. గీతా ఆర్ట్స్‌లాంటి పెద్ద సంస్థలో సినిమా చేయడానికి శర్వా కూడా రెడీగానే ఉన్నట్టు సమాచారం. కథ నచ్చితే గనుక… శతమానం భవతి పూర్తయిన వెంటనే ఈ చిత్రమే సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి.
మరోవైపు శిరీష్ కోసం కొత్త కథలు వెదికే పనిలో ఉంది గీతా ఆర్ట్స్ సంస్థ. దాని కోసం అల్లు అర్జున్ ప్రణాళికలు కూడా సిద్దం చేసినట్టు టాక్. కొంతమంది యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుల లిస్టు ఒకటి తయారు చేశారట అరవింద్. షార్ట్ ఫిల్మ్స్‌తో ఆకట్టుకొన్నవాళ్లు, ప్రముఖ దర్శకుల దగ్గర సహాయకులుగా పనిచేస్తున్నవారి పేర్లూ ఆ జాబితాలో ఉన్నాయి. ఒకొక్కరినీ పిలిచి… అల్లు అరవింద్ మాట్లాడుతున్నార్ట. కథ నచ్చితే.. ఆ దర్శకుడికి అడ్వాన్స్ చేతిలో పెట్టేస్తున్నారని టాక్. అలా నాలుగైదు కథలు సిద్దం చేసి, అందులో రెండింటిని శిరీష్‌తో మిగిలిన రెండూ బయటి వాళ్లతో రూపొందించడానికి ప్రణాళికలు సిద్దం చేశారట. ‘పెళ్లి చూపులు’ సినిమా తరవాత అందరి దృష్టీ.. షార్ట్ ఫిల్మ్ మేకర్స్‌పై పడింది. వాళ్లకు ఇదే మంచి ఛాన్స్. మరి…. అరవింద్ వెలుగులోకి తీసుకొచ్చే ఆ కొత్త దర్శకులెవరో, వాళ్లెలాంటి అద్భుతాలు చేస్తారో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.