అహనా పెళ్లంట, పూల రంగడు సినిమాలతో హిట్స్ కొట్టాడు వీరభద్రమ్. అయితే భాయ్‌తో దిమ్మతిరిగే షాక్ తిగిలింది. చుట్టాలబ్బాయ్తో మళ్లీ ఓకే అనిపించుకొన్నాడు. ఇప్పుడు మరో కథ తయారు చేసుకొన్నాడు. నిర్మాత కూడా రెడీ. కానీ.. హీరో కోసమే వెయిటింగ్ మొదలైంది. కల్యాణ్ రామ్ కి ఓ కథ వినిపించాడు వీరభద్రమ్. అయితే ఏమైందో… ఈ ప్రాజెక్టు కదల్దేదు. సాయిధరమ్ తేజ్ ని కలిసినా… ‘ఇప్పట్లో నేను బీజీ ‘ అన్నాడట. ఇప్పుడు ఆ కథ శర్వానంద్ దగ్గరకు వెళ్లిందని టాక్. అహనా పెళ్లంట సమయం నుంచే శర్వానంద్‌తో ఓ సినిమా చేయాలని వీరభద్రమ్ అనుకొన్నాడు. ‘మనం కలసి ఓ సినిమా చేయాల్సిందే’ అని శర్వానంద్ కూడా వీరభద్రమ్ తో చెప్పాడట. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి అంతా సెట్ అయినట్టు టాక్.
ఇటీవల శర్వానంద్‌ని కలసి వీరభద్రమ్ కథ వినిపించినట్టు, దానికి శర్వా కూడా పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. కాకపోతే శర్వా కూడా ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. వీరభద్రమ్ సినిమాకి ఎప్పటి నుంచి కాల్షీట్లు ఇస్తాడో చెప్పలేని పరిస్థితి. 2017 మార్చిలో ఈ సినిమా మొదలయ్యేఅవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వీరభద్రమ్ ది కామెడీ + యాక్షన్ ఫార్ములా. అయితే ఈసారి మాత్రం ఓ థ్రిల్లర్‌ని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా టైపులో సాగే కథ ఇదని సమాచారం. అందుకే శర్వా కూడా ఓకే చెప్పాడట. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.