శర్వానంద్ మోటార్‌సైకిల్ రేసర్‌గా చేస్తున్న సినిమా బైకర్. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించింది. తాజాగా ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ‘ఇక్కడ ప్రతి బైకర్ కి ఒక కథ ఉంటుంది. సమయంతో పోరాడే కథ. చావుకి ఎదురెళ్ళే కథ. ఏం జరిగినా పట్టు వదలని మొండివాళ్ళ కథ. ఇక్కడ గెలవడం గొప్పకాదు. చివరిదాక పోరాటం గొప్ప’ ఈ వాయిస్ ఓవర్ తో కూడిన గ్లింప్స్ సినిమా నేపధ్యాన్ని పరిచయం చేసింది.
గ్లింప్స్ మొత్తం మోటార్‌సైకిల్ రేసింగ్ నే చూపించారు. శర్వా మరో ఇంటెన్స్ క్యారెక్టర్ చేస్తున్నాడని గ్లింప్స్ చూస్తే అర్ధమౌతోంది. ఈ సినిమాలో ఫ్యామిలీ డ్రామా కూడా వుంది. మాళవిక నాయర్ తో పాటు బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి లాంటి నటులు వున్నారు. అయితే ఈ వీడియోని మాత్రం కేవలం రేసింగ్ కి పరిమితం చేశారు. డిసెంబర్ 6న సినిమా రిలీజ్ చేస్తున్నారు. రేసింగ్ బ్యాక్ డ్రాప్ తెలుగులో సినిమాలు రావడం అరుదు. జానర్ పరంగా బైకర్ ఫ్రెష్ గా కనిపిస్తోంది. మరి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా వుంటుందో చూడాలి.