చైతన్య : శృంగారం – అశ్లీలం..! తేడా ఎవరు తేల్చాలి..?

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాషెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలు తీసి యాప్స్‌లో పెడుతున్నారన్న కారణంగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. తాము తీస్తున్నది అశ్లీలం కాదని.. కేవలం శృంగారమేనని శిల్పాషెట్టి వాదిస్తున్నారు. అయితే ఆమె ఆ బిజినెస్ గురించి తనకు తెలియదని చెబుతున్నారు. కానీ తన భర్తను డిఫెండ్ చేయడానికి తమది అశ్లీల కంటెంట్ కాదని.. శృంగారం అనే చెబుతున్నారు. దీంతో అసలు అశ్లీలం ఏమిటి..? శృంగారం అంటే ఏమిటనేదానిపై చర్చ ప్రారంభమయింది.

” మనసు పలికే మౌనగీతం ” పాట ఏ కేటగిరీ కిందకు వస్తుంది..?

కొన్నాళ్ల క్రితం కొంత మంది మిత్రులతో పిచ్చాపాటిగా మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి చర్చే ఒకటి జరిగింది. దానికి కారణం… దర్శక దిగ్గజం విశ్వనాథ్ తీసిన స్వాతిముత్యం సినిమాలోని ” మనసు పలికే మౌనగీతం ” పాట. ఆ పాట విషయంలో రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒకరు అది బూతు అని వాదిస్తారు. మరికొంత మంది శృంగారం అని వాదిస్తారు. దీనిపై చర్చనంతటిని నేను ఆసక్తిగా గమనించా. నిజానికి ఆ పాట చూసిన ఎవరికైనా స్పందనలు వస్తాయి. అంతగొప్పగా ఉంటుందీ ఆ పాట.. అలాగే చిత్రీకరణ కూడా. ఎవరికి వారు వాదించుకున్నారు కానీ.. ఎవరూ అభిప్రాయం మార్చుకోలేదు. మార్చుకోరు కూడా. అభిప్రాయాలు మారేవి కావు.

ఇప్పటి తరం ఆ పాటను బూతుగా చూస్తుందా..? శృంగారంగానా..?

నా వరకు అది బూతు కాదు. అద్భుతమైన శృంగారం. అంతే చాకచక్యంగా తెరపైకి ఎక్కించారు. దాన్ని ప్రేక్షకులు ఆదరించారు. అప్పట్లో ఎవరికీ అది బూతుగా అనిపించలేదు. చూసేవారికి.. చివరికి సెన్సార్ వారికి కూడా అభ్యంతరం అనిపించలేదు. కానీ కొత్త తరానికి మాత్రం అర్థం మారిపోయింది. సినిమా క్రియేటర్లు.. కంటెంట్ క్రియేటర్లు.. రోజు రోజుకు శృంగారానికి – అశ్లీలతకు మధ్య గీతను చెరిపేస్తూ.. కొత్త తరాన్ని గందరగోళానికి గురి చేశారు. ఫలితంగా ఇప్పుడు శృంగారానికి.. ఆశ్లీలతకు మధ్య తేడా వారు గుర్తించలేకపోతున్నారు. నిజం చెప్పాలంటే.. ఇప్పుడు యాప్స్‌లో,వెబ్ సీరిస్‌లలో… సినిమాలలో వచ్చే డైరక్ట్ ఇంటిమేట్ సీన్లు చూసి.. అదే శృంగారం అనుకునే యువత… ” మనసు పలికే మౌనగీతం ” పాట చూస్తే ఇంత బూతును అప్పట్లో ఎలా అంగీకరించారని ఆశ్చర్యపోయినా అతిశయోక్తి ఉండదు.

శృంగారానికి ఎప్పుడో అర్థం మార్చేసిన బాలీవుడ్..!

ప్రస్తుతం బాలీవుడ్‌లో శృంగారానికి అర్థం ఎప్పుడో మారిపోయింది. శృంగారం అంటే డైరక్ట్ సెక్స్. మర్డర్ లాంటి సినిమాలు సంచలన విజయాలు సాధించిన తర్వాత ఇక.. సెన్సార్ బోర్డులు … చట్టాలు ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు. వెబ్ సిరీస్‌లలో డైరక్ట్ ఇంటిమేట్ సీన్లు ప్రత్యక్షమైన తర్వాత కొత్తగా అలాంటి సినిమాలు తీస్తున్నారని కేసులు పెట్టడమూ పెద్ద వింతే. ప్రస్తుతం రాజ్‌కుంద్రా తీస్తున్నది శృంగారమా.. అశ్లీలమా అన్నది ఎవరికీ తెలియదు. ఎవరూ జడ్జ్ చేయలేరు. తాను తీస్తున్నది అశ్లీలం కాదని.. శృంగారమేనని ఆయన వాదిస్తున్నారు. న్యాయస్థానాలు ఆయన వాదనను ఎలా పరిగణనలోకి తీసుకుంటాయో తెలియదు.

వర్మ జీఎస్టీకి లేని చట్టాలు.. రాజ్ కుంద్రా శృంగార చిత్రాలకే వచ్చాయా..?

కానీ రాజ్ కుంద్రా కేసు మాత్రం… ఖచ్చితంగా ఓ ప్రమాణాలను నిర్దేశించడానికి అవసరమైన సరంజామా మాత్రం రెడీ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే… జీఎస్టీ పేరుతో రామ్‌ గోపాల్ వర్మ ఓ కళాఖండం తీశారు. అందులో .. స్త్రీ శరీరాన్ని తన ఆలోచనా పరిధి మేరకు ప్రదర్శింపచేశారు. దాన్ని ఎక్కడ చిత్రీకరించారన్నదానిపై వివాదం ఉంది. కానీ దాన్ని ఆయన నేరుగా విపరీతమైన పబ్లిసిటీతో ఇండియాలో విడుదల చేశారు. కానీ ఆయనపై ఎలాంటిచర్యలు తీసుకోలేదు. ఇప్పుడు… రాజ్ కుంద్రా వ్యవహారంలో అదెందుకు నేరమయింది…? ఇతరుల విషయంలో ఎందుకు కాదు..? అసలు ఏది బ్లూ ఫిల్మ్.. ఏది మామూలు ఫిల్మ్ అనేది ఎలా తెలుస్తారు..? ఇవన్నీ చర్చనీయాంశం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close