తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డిని నియమిస్తూ సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. 1994 బ్యాచ్ IPS అధికారి శివధర్ రెడ్డి. ప్రస్తుత DGP జితేందర్ పదవీకాలం సెప్టెంబర్ 30తో ముగియనుంది. శివధర్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ విభాగం DGగా పనిచేస్తున్నారు. ప్రస్తుత డీజీపీ జితేందర్ 2024 డిసెంబర్లో ఈ పదవిని చేపట్టారు.
శివధర్ రెడ్డి కేసీఆర్ హయాంలోనూ మొదట ఇంటలిజెన్స్ చీఫ్గా చేశారు తర్వాత ఆయనను తప్పించారు. ఓటుకు నోటు కేసు జరిగినప్పుడు ఆయనే ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. తర్వాత లూప్ లైన్లో ఉండిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ గెలిచిన తర్వాత రేవంత్ మొదటి నియామకంగా శివధర్ రెడ్డిని ఇంటలిజెన్స్ చీఫ్గా నియమించారు.
శివధర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. DIGగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్, ACB అదనపు డైరెక్టర్గా పనిచేశారు. IGగా ACB డైరెక్టర్, విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్గా పని చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత, TRS ప్రభుత్వం ఆయనను మొదటి ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2023 డిసెంబర్లో మళ్లీ ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించారు.