క్రిష్ పెళ్లి కోసం విరామం తీసుకొన్న గౌతమి పుత్ర శాతకర్ణి టీమ్ ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగింది. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రమిది. 40 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. ఈరోజు నుంచి మధ్య ప్రదేశ్ లో ఈరోజు నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించారు. 18 రోజుల పాటు ఏకధాటిగా సాగే షూటింగ్లో రాజదర్బార్కి సంబంధించిన కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. కథానాయికగా శ్రియ, బాలయ్య తల్లి పాత్రలో హేమామాలినీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజే.. వాళ్లూ గౌతమి పుత్ర సెట్లోకి అడుగుపెట్టారు. తొలి రెండు షెడ్యూళ్లలో యుద్ధ సన్నివేశాలు తెరకెక్కించారు. ఇప్పుడు టాకీ మొదలైనట్టే. 2017 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అందుకే చకచక చిత్రీకరణ సాగిపోతోంది. మధ్యప్రదేశ్ నుంచి తిరిగొచ్చాక హైదరాబాద్‌లో చిత్రీకరణ కొనసాగిస్తారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా ఓ సెట్ తీర్చిదిద్దారు. నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా గౌతమి పుత్ర లుక్ బయటకు వచ్చింది. దసరాకి టీజర్‌ని చూపించాలని చిత్రబృందం భావిస్తోంది.