లారెన్స్ తో నయన్ , శ్రుతిహాస‌న్‌!

లారెన్స్ క‌థానాయ‌కుడిగా స్టూడియో గ్రీన్ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. ‘రైడ్‌’, ‘రాక్ష‌సుడు’ చిత్రాలతో హిట్లు కొట్టిన ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రానికి ‘శ్రీ‌రామ‌ర‌క్ష‌’ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఈ సినిమా కోసం ఇద్ద‌రు హీరోయిన్లు కావాలి. ఓ క‌థానాయిక‌గా న‌య‌న‌తార‌, మ‌రో పాత్ర కోసం శ్రుతి హాస‌న్ పేర్లు దాదాపుగా ఖరారు అయ్యాయి. లారెన్స్‌తో వీరిద్ద‌రూ జోడీ క‌ట్ట‌డం ఇదే తొలిసారి. ఈనెల 14న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. హార‌ర్ నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. లారెన్స్‌కి హార‌ర్ క‌థ‌లు బాగానే వ‌ర్క‌వుట్ అయ్యాయి. ‘కాంచ‌న’ సిరీస్‌తో క‌న‌క వ‌ర్షం కురిసింది. లారెన్స్ మార్కెట్ పెర‌గ‌డానికి హార‌ర్ జోన‌ర్ ఓ కార‌ణ‌మైంది. లారెన్స్‌కి చాలా కాలంగా హిట్లు లేవు. మ‌ళ్లీ ఈ జోన‌ర్‌తో త‌న‌కు హిట్ ప‌డుతుందేమో చూడాలి. కాక‌పోతే ఓ హార‌ర్ చిత్రానికి ‘శ్రీ‌రామ‌ర‌క్ష‌’ అనే ఫ్యామిలీ టైటిల్ పెట్ట‌డం కొత్త‌గా అనిపిస్తోంది. హార‌ర్ క‌థ‌కూ, ఈ టైటిల్ కూ ఉన్న లింకేంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close