ఇండస్ట్రీలో హీరోలకి ఉన్నంత లాంగ్ కెరీర్ హీరోయిన్స్ కి ఉండదు. చాలామంది హీరోయిన్స్ ఒక 10 ఏళ్ల పాటు ఓ వెలుగు వెలిగి ఆటోమేటిగ్గా ఫేడ్ అవుట్ అయిపోతారు. హీరోలు మాత్రం జనరేషన్స్ కి కథానాయకులుగా కొనసాగుతుంటారు. అందుకే కథానాయిక విషయంలో ఎప్పుడూ ఏజ్ గ్యాప్ అనేది ఉండనే ఉంటుంది. దీనిపై ట్రోల్స్ కూడా సర్వసాధారణంగానే జరుగుతుంటాయి.
ఇటీవల థగ్ లైఫ్ సినిమాలో కమల్ హాసన్, త్రిషతో రొమాన్స్ చేయడం సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ అయింది. డైరెక్టర్ మణిరత్నం దీనిపై స్పందిస్తూ ”మీరు రెండు పాత్రలనే చూడండి. కమలహాసన్, త్రిషని ఎందుకు చూస్తున్నారు. ఆ ఏజ్ గ్యాప్ రిలేషన్షిప్ మన సొసైటీలో ఉన్నాయి. సొసైటీలో ఉన్న పాత్రలనే తెరమీద చూపించడం జరుగుతుంది” అని సమాధానం ఇచ్చారు.
తాజాగా శృతిహాసన్‌కి ఇలాంటి ప్రశ్న ఒకటి ఎదురైంది. కూలీ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తుంది శృతి. ఆమెది హీరోయిన్ పాత్ర కాదు అయినప్పటికీ రజినీకాంత్ ఉండడంతో ఆటోమేటిక్‌గా అలాంటి ప్రశ్న ఒకటి తలెత్తుతుంది. ఇదే ఏజ్ గ్రూప్ గురించి ఆమె దగ్గర ప్రస్తావిస్తే ఒక రకమైన అసహనాన్ని వ్యక్తం చేసింది.
”నాకు ఎవరి సంగతి తెలియదు. నేను ఏజ్ సంగతి పట్టించుకోను. మాట్లాడుకునే వాళ్లు బోలెడు మాట్లాడుకుంటారు. నా వరకు నాకు వచ్చిన పాత్రను చేయడమే నాకు తెలుసు. ఒక పాత్రనే చూస్తాను తప్పితే అందులో ఏజ్ ని చూడను” అని కాస్త కరుకుగానే సమాధానం చెప్పింది శృతి.
కూలీలో స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్ చేసిందట శృతి. లోకేష్ కనకరాజు సినిమాలన్నీ చాలా డార్క్ జానర్లో, అలాగే కేవలం మగవాళ్లకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే పాత్రలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇందులో శృతిహాసన్‌కి మాత్రం చాలా బలమైన ఒక స్త్రీ పాత్రని చేసే అవకాశం దొరికిందట. అందుకే మరో ఆలోచన లేకుండా ఈ సినిమా చేసిందట. ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.