చిరుతో పాట‌.. మ‌ళ్లీ ఆ త‌ప్పు చేయ‌నంటున్న శ్రుతి

శ్రుతి హాస‌న్ జాక్ పాట్ కొట్టేసింది. వ‌రుస‌గా చిరంజీవి, బాల‌కృష్ణ సినిమాల్లో క‌థానాయిక‌గా అవ‌కాశాలు అందుకొంది. రెండు సినిమాలూ ఈ సంక్రాంతికే విడుద‌ల అవుతున్నాయి. ఇద్ద‌రు పెద్ద హీరోల సినిమాలూ.. రెండూ ఇంచుమించు ఒకేసారి విడుదల అవ్వ‌డం, రెండింటోనూ శ్రుతినే క‌థానాయిక కావ‌డం… నిజంగా విశేష‌మే. ఈ రెండు సినిమాల‌పైనా శ్రుతి చాలా ఆశ‌లు పెట్టుకొంది. త‌ప్ప‌కుండా ఈ రెండు సినిమాలూ హిట్ట‌వుతాయ‌ని అంటోంది. వాల్తేరు వీర‌య్య‌లో.. చిరుతో క‌లిసి స్టెప్పులేసింది శ్రుతి. ఇందులో ‘చిరంజీవి – శ్రీదేవి’ పాట సూప‌ర్ హిట్ట‌య్యింది. ఈ పాట‌ని పారిస్‌లో తీశారు. మైన‌స్ 8 డిగ్రీల ఉష్ణోగ్ర‌త వ‌ద్ద ఈ పాట‌ని తెర‌కెక్కించారు. ఈ పాట చూడ్డానికి బాగున్నా చేయ‌డానికి చాలా ఇబ్బంది ప‌డాల్సివ‌చ్చింద‌ని అంటోంది శ్రుతి.అంత చ‌లిలో.. చీర క‌ట్టుకొని పాట‌కు డాన్స్ చేయ‌డం సుల‌భ‌మైన విష‌యం కాద‌ని, పాట బాగున్నా.. సెట్లో ఎంజాయ్ చేయ‌లేక‌పోయాయ‌ని, మ‌ళ్లీ అలాంటి త‌ప్పు జీవితంలో చేయ‌న‌ని చెప్పుకొచ్చింది శ్రుతి హాస‌న్‌.

“ఇలాంటి పాటల్ని చూడ్డానికి ప్రేక్ష‌కులు ఇష్ట‌ప‌డుతున్నారు. కాక‌పోతే… తెర‌కెక్కించ‌డం మాత్రం చాలా క‌ష్టం. అంత‌టి క్లిష్ట‌ప‌రిస్థితుల్లో స్టెప్పులేయ‌డం అవ‌స‌రమా అనిపించింది? ఇంకెప్పుడూ ఇలాంటి వాతావ‌ర‌ణంలో ప‌నిచేయ‌ను..“ అంటోంది. చిరుతో చేసిన వాల్తేరు వీర‌య్య‌, బాల‌య్య‌తో చేసిన వీర సింహారెడ్డి రెండూ… సూప‌ర్ హిట్ అవుతాయ‌న్న ధీమా వ్య‌క్తం చేసింది. “ఇద్ద‌రు పెద్ద హీరోల‌తో ఒకేసారి ప‌నిచేయ‌డం గొప్ప అనుభ‌వం. ఈ సినిమాల కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. త‌ప్ప‌కుండా మంచి ఫ‌లితం వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌“న్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

గుంటూరు కారం: త్రీడీలో క‌నిపించిన బీడీ

https://www.youtube.com/watch?v=V-n_w4t9eEU&feature=youtu.be ముందు నుంచీ అనుకొంటున్న‌ట్టే.. మ‌హేష్ బాబు - త్రివిక్ర‌మ్ సినిమాకి 'గుంటూరు కారం' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌యంతి సంద‌ర్భంగా ఈ రోజు ఫ‌స్ట్ గ్లిమ్స్ విడుద‌ల...

కేశినేనికి దారి తెలీడం లేదా ?

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తనను తాను ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు. బెజవాడను తిరుగులేని విధంగా అభివృద్ధి చేశానని.. టాటా ట్రస్ట్ అంటే తనదేనన్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఇండిపెండెంట్ గా...

‘గుహ’ క‌డుతున్న ప్ర‌భాస్‌

డ్రీమ్ హౌస్‌.. అంటూ ప్ర‌తీ ఒక్క‌రికీ ఉంటుంది. త‌మ ఇల్లు ఎలా ఉండాలో.. ముందు నుంచీ క‌ల‌లు కంటుంటారు. అలాంటి క‌ల ప్ర‌భాస్‌కీ ఉంది. అత్యాధునిక హంగుల‌తో ఓ ఫామ్ హౌస్ నిర్మించుకోవాల‌ని...

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు కేంద్రం కూడా రెడీ !

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఎవరూ ఊహించని విధంగా .. అత్యంత కాస్ట్ లీగా నిర్వహించడానికి తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది. మరోసారి మన తెలంగాణ .. అనే సెంటిమెంట్ అందరిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close