వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల హైదరాబాద్ లో నివాసం ఉంటారు. ఏపీలో రాజకీయాలు చేస్తారు. ఇలా చాలా మంది చేస్తారు. కానీ శ్యామల స్టైల్ వేరు. ఏపీ రాజకీయాలు కూడా హైదరాబాద్ లో .. అదీ కూడా తాను నివాసం ఉండే కూకట్ పల్లిలో చేస్తారు. ఆమెకు.. కారుమూరి వెంకటరెడ్డి అనే నేత తోడుగా ఉంటారు. ఇద్దరూ కలిసి కూకట్ పల్లిలో సంతకాల సేకరణలు.. ధర్నాలు, ఆందోళనలు చేస్తూంటారు. చూసేవారికి కాస్త వింతగా ఉంటుంది కానీ.. వారికి మాత్రం కాదు.
ఆదివారం కూడా ఆమె రాజకీయ డ్యూటీ చేశారు. కూకట్ పల్లితో తాను నివాసం ఉండే ఇంటి దగ్గర ఓ ప్లేస్ చూసుకుని కారుమూరి వెంకటరెడ్డితో పాటు మరో పాతిక మందిని పిలిపించుకుని ధర్నా చేశారు. ఎందుకంటే మాచర్ల మాజీ ఎమ్మెల్యే,ఆయన తమ్ముడు ఇద్దరూ సాత్వికులని వారిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారని ధర్నాచేశారు. పనిలో పనిగా విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో వారు కోర్టులో లొంగిపోయారు. రిమాండ్ కు వెళ్లారు. ఆ విషయం శ్యామలకు తెలియదో.. లేకపోతే పిన్నెల్లి బ్రదర్స్ కోసం తాను ముందుంటానని నిరూపించాలనుకున్నారో చేసేశారు.
అంతకు ముందు మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోకి మార్చడానికి కూడా సంతకాలు సేకరణ అదే కూకట్ పల్లిలో చేశారు. ధర్నా చేసిన ప్రాంతంలోనే చేశారు. కారుమూరి వెంకటరెడ్డి కొంత మంది సానుభూతిపరుల్ని మొబిలైజ్ చేసుకు వస్తూంటే.. ఆమె రాజకీయం చేస్తున్నారు. అయినా ఏపీలో రాజకీయాలు కూకట్ పల్లిలో చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో వైసీపీ వాళ్లకూ అర్థం కావడం లేదు. ఆమెకు ఎందుకు వచ్చిందో కానీ మీకు ఎందుకు రాలేదని సిగ్గుపడాలని సెటైర్లు వేసుకుని అందరూ లైట్ తీసుకుంటున్నారు.


