సిద్ధార్థ్‌కి లవర్ బాయ్ ఇమేజ్ ఎంత మేలు చేసిందో, అంత కీడు తలపెట్టింది. ఆయనకి అన్నిరకాల సినిమాలు చేయాలని ఉంటుంది. కానీ ఆయన నటించిన ప్రేమకథలే ఎక్కువ విజయాలు సాధించడంతో ఒక ముద్ర పడిపోయింది. అయితే ఆ ఇమేజ్ నుంచి ఎప్పటికప్పుడు బయటకు రావాలనే ప్రయత్నిస్తున్నాడు. ఆయన 40వ చిత్రం ‘3 బీహెచ్‌కే’ అలాంటి ప్రయత్నమే. శ్రీ గణేశ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.
తాజాగా తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. సొంతిల్లు… చాలామందికి కల. ఆ డ్రీమ్‌ని నెరవేర్చుకునేందుకు ఓ మధ్య తరగతి కుటుంబం ఎన్ని కష్టాలు పడిందన్న కథాంశంతో రూపొందిన సినిమా ఇది. సొంతిల్లు కోసం జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తండ్రి, ఆ కలని కొడుకుపై భుజాన పెడతాడు. అయితే కెరీర్ పరంగా ఎన్నో కష్టాలు పడుతున్న కొడుకు 34 సంవత్సరాల వయస్సులో కూడా ఉద్యోగం లేకుండా ఉంటాడు. మరి వారి సొంతిల్లు కల నెరవేర్చడానికి ఎలాంటి మార్గాలు అన్వేషించారు? ఎన్ని ఇబ్బందులు పడ్డారన్నదే ఇందులో ప్రధాన కథాంశం.
ట్రైలర్ చాలా సహజంగా ఉంది. సిద్ధార్థ్ తన పాత్రలో ఒదిగిపోయాడు. అతని లుక్ ఫ్రెష్‌గా ఉంది. శరత్ కుమార్, దేవయాని, మీతా రఘునాథ్, చైత్ర పాత్రలు కూడా బాగా ఉన్నాయి. అందరూ రిలేట్ అయ్యే కథని రాసుకున్నాడు దర్శకుడు. మంచి ఫ్యామిలీ సినిమా వచ్చిన చాలా రోజులైంది. మరి ఆ గ్యాప్‌ని ‘3 బీహెచ్‌కే’ భర్తీ చేస్తుందేమో చూడాలి. సినిమా జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.