సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ టీజర్ బయటికివచ్చింది. నీరజ కోన డైరెక్టర్గా పరిచయమౌతన్న సినిమా ఇది. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. హీరోది కన్ఫ్యూజన్ క్యారెక్టర్. ఇద్దరినీ ఇష్టపడతాడు. అసలు తన మైండ్ లో ఏం నడుస్తుందని అడిగితే .. ‘తెలుసు కదా’ అంటాడు. అదేంటో సినిమాలోనే తెలుసుకోవాలి. టీజర్ లో అసలు పాయింట్ రివిల్ చేయలేదు. ఎదో ఆసక్తికరమైన పాయింటే వుంది.
సిద్ధు జొన్నలగడ్డ టిల్లు క్యారెక్టర్ నుంచి బయటకి రావాలని ప్రయత్నిస్తున్నాడు కానీ తన డైలాగుల్లో టిల్లు ఛాయలు కనిపిస్తున్నాయి. రాశీ ఖన్నా, శ్రీనిధి పాత్రలు మాత్రం కాస్త కొత్తగా వున్నాయి. ఆ రెండు పాత్రల మధ్య ఎదో అండర్ స్టాండింగ్ వుంది. నీరజ కోన మంచి స్టయిలిస్ట్. టీజర్ లో ఆమె అభిరుచి కనిపించింది. తమన్ ఇలాంటి లవ్ స్టొరీకి స్కోర్ చేసి చాలా కాలమైయింది. తన టచ్ వినిపించింది. జాక్ లాంటి డిజాస్టర్ తర్వాత సిద్దు నుంచి వస్తున్న సినిమా ఇది. దీపావళికి రిలీజ్. తెలుసు కదాతో హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు సిద్దు.
