పవన్‌పై పెట్టింది సిల్లీ కేసు..ఫిర్యాదు దారుడు కూడా ఫేకేనా ?

తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో పవన్ కల్యాణ్‌పై పెట్టిన కేసు.. పోలీసులను ప్రజల్లో మరంత చులకన చేస్తోంది. ఆ ఎఫ్ఐఆర్‌లో ప్రాథమిక వివరాలు లేవు. శివకుమార్ అనే వ్యక్తి.. ఫిర్యాదు చేశాడు కానీ.. మిగతా వివరాల్లేవు. కనీసం ఫోన్ నెంబర్ లేదు. ఐదు రోజుల తర్వాత ఎందుకు ఫిర్యాదు చేశాడో కారణం లేదు. అసలు ఆ ఫిర్యాదులో యాక్సిడెంట్ చేసినట్లుగా లేదు. తనకు తానే పడ్డానని ఉంది. ఈ ఎఫ్ఐఆర్ చూసిన తర్వాత .. మీడియా వర్గాలకూ కామెడీ అనిపించింది. కక్షతో కళ్లు మూసుకుపోయి.. ఏదో ఒకటి చేద్దామని నవ్వుల పాలవుతున్నారని వారికీ అర్థం అయింది.

పోలీసులకూ తాము చేసిన తప్పేంటో తెలిసిపోయినట్లుగా ఉంది. అటు పోలీసుల,ఇటు ఫిర్యాదు దారుడు కూడా మాట్లాడలేకపోతున్నారు. పోలీసులు ఎదైనా పెద్ద కేసు నమోదు చేసినప్పుడు మీడియాకు సమాచారం అందిస్తారు. కానీ ఈ కేసులో మాత్రం సమాచారం బయటకు వెళ్ళకుండా జాగ్రత్త పడ్డారు. ఎఫ్ఐఆర్ రెండు రోజుల తర్వాత లీక్ కావడంతో తాడేపల్లి పోలీస్ స్టేషన్ సీఐ శేషగిరి ఫోన్ ను స్వీచ్ ఆఫ్ చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన శివ అనే వ్యక్తి అసలు కనిపించడం లేదు తెనాలి మోరిస్ పేటలో శివ ఎవరో ఎవర తెలుసుకోలే్కపోతున్నారు.

పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు వ్యవహరం రాజకీయ కోణంలో జరిగిందని ఎవరికైనా అర్థం అవుతుంది. పోలీసులు అడ్డుకోవడం వల్లనే పవన్ తన వాహనం పైకి ఎక్కి అభిమానులకు అభివాదం చేసుకుంటూ,అలానే ఇప్పటం వరకు వెళ్ళారు. ఆ రోజే పోలీసులు రెచ్చగోట్టేలా వ్యవహరించారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కూడ పవన్ పై ఆలస్యంగా కేసు నమోదు చేయటం,- నమోదు అయిన కేసు వివరాలను కూడా బయటపెట్టేందుకు రెండు రోజులు ఆలస్యం చేయటం వెనుక పూర్తి రాజకీయ కోణంలోనే జరిగిందని చెబుతున్నారు. ఈ కేసులో పవన్‌ను ప్రభుత్వం ఏం చేాయలనుకుంటుందో కానీ.. తనతో పాటు పోలీసుల్నీ నవ్వులపాలు చేసిందని మాత్రం కామెంట్స్ వినపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close