ఆయ‌న టీడీపీ వీడుతార‌ని ఊహించిందే క‌దా!

నంద్యాల ఉప ఎన్నిక తేదీ స‌మీపిస్తున్న కొద్దీ అక్క‌డి రాజ‌కీయం మ‌రింత హాట్ హాట్ గా త‌యారౌతోంది. టీడీపీ నేత‌ల్ని త‌మ‌వైపు తిప్పుకోవ‌డంపై వైకాపా ప్ర‌త్యేక దృష్టి పెట్టింద‌ని చెప్పొచ్చు. నిజానికి, వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్ రెడ్డి కూడా ఆ విధంగానే పార్టీలోకి వ‌చ్చారు క‌దా! శిల్పా మోహ‌న్ రెడ్డితోపాటు ఆయ‌న అనుచ‌రగ‌ణం కూడా టీడీపీని వీడిన సంగ‌తి తెలిసిందే. ఇదే క్ర‌మంలో శిల్పా మోహ‌న్ సోద‌రుడైన ఎమ్మెల్సీ చ‌క్ర‌పాణి రెడ్డి కూడా పార్టీ వీడుతార‌నేది అప్పుడే అంద‌రూ ఊహించారు. కానీ, కొన్నాళ్ల‌పాటు చ‌క్ర‌పాణి రెడ్డి మౌనంగా ఉన్నారు. ఆయ‌న పార్టీ మార్పుపై టీడీపీ వ‌ర్గాలు కూడా పెద్ద‌గా కామెంట్స్ చేయ‌లేదు. దీంతో ఆయ‌న త‌ట‌స్థంగా ఉంటారేమో అనే విశ్లేష‌ణ‌లు కూడా ఓ ద‌శ‌లో వినిపించాయి. అయితే, చ‌క్ర‌పాణి రెడ్డి కూడా టీడీపీకి గుడ్ బై చెప్పేయ‌డం దాదాపు ఖాయం అనే ఇప్పుడు చెప్పొచ్చు.

ఈ మ‌ధ్య ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నంద్యాల ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే, సీఎం కార్య‌క్ర‌మానికి చ‌క్ర‌పాణి రెడ్డి రాలేదు. ఉప ఎన్నిక సంద‌ర్భంగా నంద్యాల‌ తెలుగుదేశం నేత‌లంద‌రూ రాత్రింబ‌వ‌ళ్లు గెలుపు కోసం వ్యూహ‌ప్ర‌తివ్యూహాల్లో త‌ల‌మున‌క‌లై ఉంటే… ఈయన మాత్రం ఏమీ ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సో.. ఆయ‌న టీడీపీని వ‌దిలేసే ఆలోచ‌న‌లో ఉన్నార‌నేది అప్ప‌టికే ఓ క్లారిటీ వ‌చ్చేసింది! కానీ, ఆ విష‌యంపై నేరుగా చ‌క్ర‌పాణిగానీ, టీడీపీ వ‌ర్గాలుగానీ ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి కామెంట్లు చెయ్య‌లేదు. ఆయ‌న రాబోతున్న‌ట్టు వైసీపీ నేత‌లు కూడా ఎక్క‌డా మాట్లాడ‌లేదు. అయితే, సోమ‌వారం నాడు శిల్పా చ‌క్ర‌పాణిని, శిల్పా మోహ‌న్ రెడ్డి క‌లుసుకున్నారు. వైకాపాలో చేరిన త‌రువాత త‌న సోద‌రుడితో భేటీ కావ‌డం ఇదే ప్ర‌థ‌మం. ఈ ఇద్ద‌రూ కాసేపు భేటీ అయిన త‌రువాత మీడియాతో శిల్పా మోహ‌న్ రెడ్డి మాట్లాడారు.

వైకాపాలో చేరిన త‌రువాత త‌న త‌మ్ముడిని క‌లుసులేక‌పోయాన‌నీ, ఇన్నాళ్ల‌కు వీలు చిక్కింద‌న్నారు. వైసీపీలోకి చ‌క్ర‌పాణి ఎప్పుడు వ‌స్తున్నారు అనే ప్ర‌శ్న‌కు శిల్పా మోహ‌న్ రెడ్డి బ‌దులిస్తూ… కొంత స‌మ‌యం తీసుకుంటార‌నీ, అన్నీ ఆలోచించుకుని నిర్ణ‌యం తెలియ‌జేస్తాన‌ని త‌న‌కు చెప్పిన‌ట్టు వివ‌రించారు. ఇంకేముంది, ఆయ‌న కూడా టీడీపీకి దూరం కాబోతున్న‌ట్టు అధికారంగా క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టే అని టీడీపీ వ‌ర్గాలు అంటున్నాయి. ఆయ‌న పార్టీకి దూర‌మౌతార‌న్న‌ది ముందుగానే ఊహించేద‌న‌నీ, కానీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో నేత‌లు పార్టీని వీడి వెళ్తుంటే.. కార్య‌క‌ర్త‌ల ఉత్సాహంపై దాని ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని టీడీపీ వ‌ర్గాలు కొంత ఆందోళ‌న చెందుతున్న‌ట్టు స‌మాచారం. చ‌క్ర‌పాణితోపాటు ఇంకెవ‌రైనా నాయ‌కులు కూడా వైసీపీకి వెళ్తారా అనే సెల్ఫ్ చెక్ ఆ పార్టీలో జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది. ఈ సంద‌ర్భంలో చ‌క్ర‌పాణిని ఆపే ప్ర‌య‌త్నాలు టీడీపీ నుంచి ఉంటాయా అనేది అనుమాన‌మే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ : మాస్ట్రో

మంచి క‌థ‌ని ఎంత చెత్త‌గా తీసినా చూడొచ్చు చెత్త క‌థ‌ని ఎంత బాగా చెప్పాల‌నుకున్నా చూడ‌లేం - అన్న‌ది సినిమా వాళ్లు న‌మ్మే మాట. అందుకే మంచి క‌థ‌లు ఎక్క‌డైనా స‌రే చ‌లామ‌ణీ అయిపోతుంటాయి....

ల‌వ్ స్టోరీ కోసం చిరంజీవి

నాగార్జున‌తో చిరంజీవికి ఉన్న అనుబంధం ప్ర‌త్యేక‌మైన‌ది. ఈ విష‌యం చాలా సంద‌ర్భాల్లో రుజువైంది. నాగార్జున `వైల్డ్ డాగ్` స‌మ‌యంలో చిరు ప్ర‌త్యేక‌మైన అభిమానంతో ఆ సినిమాని ప్ర‌మోట్ చేశాడు. నాగ‌చైత‌న్య‌,...

ఏపీలో ఇళ్ల రుణాల వన్‌టైం సెటిల్మెంట్ పథకం !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీలో ప్రజలను ఇళ్ల రుణాల నుంచి విముక్తుల్ని చేయాలని నిర్ణయించారు. హౌసింగ్ లోన్ల భారంతో కట్టలేకపోయిన 46 లక్షల మందిని గుర్తించారు. వారందరికీ వన్ టైం...

చిన్నారి హత్యాచార నిందితుడి “ఆత్మహత్య” శిక్ష!

రాజకీయ వివాదంగా మారిన సింగరేణి కాలనీలో చిన్నారిపై హత్యాచారం ఘటనలో నిందితుడు చివరికి "ఆత్మహత్య" శిక్షకు గురయ్యాడు. రాజు అనే ఆ నిందితుడి మృతదేహాన్ని రైలు పట్టాలపై గుర్తించారు. ఘట్...

HOT NEWS

[X] Close
[X] Close