అప్పుడు కాదు…లాక్‌డౌన్‌లోనే రథం సింహాల చోరీ..!

విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ వెండి రథానికి ఉన్న రథాలు ఈ ఏడాది మార్చి తర్వాతనే చోరీ అయ్యాయని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నిజానికి ఆలయ అధికారులకూ ఈ విషయంపై స్పష్టత ఉంది. కానీ.. రాజకీయం కోసం తప్పదన్నట్లుగా గత ఏడాది ఉగాది ముగిసిన తర్వాత రథానికి పట్టా కట్టేసి ఉంచామని.. తెరిచి చూస్తే.. వెండి విగ్రహాలు లేవని ఫిర్యాదు చేశారు. కానీ అసలు విషయం మాత్రం పోలీసులకు చెప్పారు. ఈ ఏడాది మార్చిలో ఉగాది ఉత్సవాల కోసం.. రథాన్ని సిద్ధం చేయాలనుకున్నారు. లాక్ డౌన్ కారణంగా ఉత్సవాలు నిర్వహించకపోయినప్పటికీ.. రధానికి మెరుగులుపట్టే ప్రక్రియ ప్రారంభించారు. ఓ సంస్థకు కాంట్రాక్ట్‌కు ఇచ్చారు. ఆ సంస్థ మరో వ్యక్తికి పని అప్పగించింది. ఇప్పుడా వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు తంటాలు పడుతున్నారు.

ఈ ఏడాది మార్చిలో రధానికి మెరుగులు పట్టించినట్లుగా ఆలయ అధికారులు చెబుతున్నారు. కానీ ఆ విగ్రహాలు.. తమ హయాంలో పోయాయంటే… ప్రజలు అనుమానాలు భరించలేమనుకున్నారో.. ప్రతిపక్షాల విమర్శలను తట్టుకోలేమనుకున్నారో కానీ.. మంత్రి వెల్లంపల్లి మొదటగా… ఆ విగ్రహాలు టీడీపీ హయాంలోనే పోయాయని ప్రకటించారు. దానికి తగ్గట్లుగా ఆలయ, ఈవో చైర్మన్‌లు రకరకాల ప్రకటనలు చేయడం ప్రారంభించారు. ఈవో అయితే.. అసలు రథానికి నాలుగు సింహాల ప్రతిమలున్నాయా..? రెండే ఉన్నాయా..? అసలు అవి వెండివేనా..?.. స్టోర్ రూమ్‌లో ఉండి ఉంటాయని.. రకరకాలుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల విచారణలో మాత్రం.. తప్పు ఎప్పుడు జరిగిందో.. ఎక్కడ జరిగిందో ఓ క్లారిటీకి వస్తున్నారు.

పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించిన తర్వాత కూడా కొండపై ఆలయ అభివృద్ధి పనులు కొన్ని జరిగాయి. ఆ పనులు చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చారు. వారు కొండపైనే ఉండి పనులు చేశారు. పదిహేు రోజుల కిందట వెళ్లిపోయారు. వారిలో ఎవరైనా తీసుకెళ్లి ఉండవచ్చన్న అనుమానాలు పోలీసుల్లో ఏర్పడుతున్నాయి. ఎందుకంటే.. నాలుగో సింహపు ప్రతిమను కూడా తీసుకోవాలని ప్రయత్నించారు. కానీ అది వెల్డింగ్ చేసి అతికించడంతో తీయడం సాధ్యం కాలేదు. తీయడానికి ప్రయత్నించి పెద్ద కన్నం పెట్టిన విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. చోరీ చేసిన మూడు సింహాల ప్రతిమలు మాత్రం బోల్టులతో బిగించారు. అవి సులువుగా రావడంతో తీసుకెళ్లిపోయారు.

రాజకీయంగా వైసీపీ నేతలు… గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెప్పడానికి ప్రయత్నిస్తున్నా.. అదంతా కేవలం గందరగోళం రేపడానికేనని తాజా పరిణామాలు స్పష్టమవుతున్నాయి. లాక్‌డౌన్ విధించిన తర్వాతనే… కొండపైన ఉండేవారు.. మాత్రమే.. ఈ సింహాలను దొంగతనం చేయడం సాధ్యమని గుర్తించి.. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ తప్పు ఎక్కడ బయటపడుతుందోనని ఆలయ అధికారులు సహకరించడానికి తటపటాయిస్తూండటంతో పోలీసులకు కాస్త ఇబ్బందికర పరిస్థితులే ఎదురవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌వ‌న్ అడిగాడు.. త్రివిక్ర‌మ్ కాద‌న్నాడు

`అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` రీమేక్ కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ద‌స‌రా సంద‌ర్భంగా ఆదివారం వ‌చ్చేసింది. ఈ రీమేక్‌లో ప‌వ‌న్‌న‌టిస్తాడా, లేదా? అన్న స‌స్పెన్స్‌కు తెర‌ప‌డింది. ద‌ర్శ‌కుడిగా... సాగ‌ర్ చంద్ర పేరు ఖాయ‌మైంది. అయితే...

స‌మంత‌కు కార్తికేయ క‌ర్చీఫ్‌

ఈ ఆదివారం బిగ్ బాస్ 4 సెట్లో సంద‌డి చేసింది స‌మంత‌. మావ నాగార్జున లేని లోటుని... త‌న న‌వ్వుల‌తో, త‌న స్క్రీన్ ప్రెజెన్స్‌తో భ‌ర్తీ చేయ‌గ‌లిగింది. ఈ షోలో.. కార్తికేయ కూడా...

కోర్టు నుంచి స్టే వస్తుందనే అర్థరాత్రి కూల్చివేతలు..!

తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, సానుభూతి పరుల ఆస్తులపై అటు వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు.. ఇటు ప్రభుత్వం కూడా తమకు దఖలు పడిన అధికారాన్ని ఉపయోగించుకుని ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతోందన్న ఆరోపణలు...

ఐపీఎల్‌లో చేజింగ్ సండే..!

ఐపీఎల్‌లో ప్రతీ ఆదివారం రోమాలు నిక్కబొడుచుకునే మ్యాచ్‌లు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఆదివారం మాత్రం సాదాసీదా మ్యాచ్‌లో జరిగాయి. అయితే రెండు మ్యాచ్‌ల్లోనూ చేజింగ్ టీమ్‌లో విజయ సాధించాయి. స్కోర్ ఎంత...

HOT NEWS

[X] Close
[X] Close