అమరావతి అభివృద్ధి కోసం సహకరిస్తాం కానీ జగన్ రెడ్డి హయాంలో రద్దు చేసిన సీడ్ క్యాపిటల్ ఒప్పందంలోకి మళ్లీ రాలేమని సింగపూర్ స్పష్టం చేసింది. తమ గత అనుభవాలు అంత భయంకరంగా ఉన్నాయని వారు ఉదాహరణలు చెప్పారు. కానీ ఏపీ విషయంలో వారు సానుకూలంగా ఉన్నారు. ఇతర పెట్టుబడులు, సహకారం విషయంలో తమ సాయం ఉంటుందన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే వైసీపీ పార్టీ గంతులేసింది. చంద్రబాబు ఒప్పించలేకపోయారని.. ఇదేనా మీ క్రెడిబులిటీ అని ట్వీట్లు వేసింది. వైసీపీ వ్యవహారం చూసి నెటిజన్లు కూడా ఇదేం సైకోతనం అని ఆశ్చర్యపోతున్నారు.
ఏపీ అంటే భయపడేలా చేసింది జగనేగా!
చంద్రబాబునాయుడు మొదటి సారి సీఎం అయినప్పుడు.. సింగపూర్ ఏపీకి విస్తృతంగా సహకరించింది. అమరావతి మాస్టర్ ప్లాన్ మొత్తం సింగపూర్ దే. ఉచితంగా ఇచ్చింది. తర్వాత సీడ్ క్యాపిటల్ లో ఓ భాగం అభివృద్ధి చేసే ప్రాజెక్టును దక్కించుకుంది. కాంట్రాక్టు ఒప్పందాలను అమల్లోకి తేక ముందు వైసీపీ కోర్టులకు వెళ్లింది.. ఎవరెవరికో మెయిల్స్ పెట్టింది. ఇష్టం వచ్చినట్లుగా ఫిర్యాదులు చేసింది. చివరికి తమ ప్రభుత్వం వచ్చాక వారిపై అవినీతి ముద్ర వేసి.. బ్లాక్ మెయిల్ చేసి రూ. 143 కోట్లు లంచం వాటాగా డిమాండ్ చేశారు. చివరికి.. ఒప్పందం రద్దు చేశారు. మరోసారి ఏపీ అంటే వైపు చూడాలంటేనే భయపడేలా చేశారు.
ఇప్పుడు సింగపూర్ మళ్లీ ఒప్పుకోలేదని ఆనందం
జగన్ రెడ్డి చేసిన ఘోరమైన తప్పిదాలను సరిదిద్ది.. మళ్లీ ఏపీకి సింగపూర్ కంపెనీలు రావాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. జగన్ అనే భూతాన్ని తాము చూస్తూ అక్కడికి రాలేమని పరోక్షంగా తేల్చి చెప్పేశారు. సింగపూర్ అవినీతి లేని టాప్ త్రీ దేశాల్లో ఒకటి. స్పోర్ట్స్ ఈవెంట్స్ టిక్కెట్స్, కొన్ని సౌకర్యాలను నిబంధనలకు విరుద్ధంగా పొందినందుకు ఈశ్వరన్ అనే మంత్రిని సింగపూర్ లో సొంత ప్రభుత్వం జైలుకు పంపింది. అవినీతి విషయంలో జీరో టాలరెన్స్ చూపిస్తారు. అలాంటి దేశంపైనే అవినీతి ముద్ర వేసి.. లంచాలను డిమాండ్ చేసిన వ్యక్తి జగన్. అలాంటి వ్యక్తి ఉన్న రాష్ట్రానికి మరోసారి వస్తారా ?. తాము సీడ్ క్యాపిటల్ అభివృద్ధిలో పాల్గొనలేమని చెబితే..దాన్ని సాక్షి,వైసీపీ సెలబ్రేట్ చేసుకుంది. అది చంద్రబాబు పలుకుబడి అని సెటైర్లు వేస్తుంది.కానీ జగన్ రెడ్డి నిర్వాకమని మాత్రం చెప్పడం లేదు.
ఏపీ అభివృద్ధి చెందితే వైసీపీకేం నష్టం !
పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాలని, ఏపీ అభివృద్ది చెందాలని ఎవరైనా కోరుకుంటారు. తాను ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ఏపీని ఓ మాఫియా రాజ్ గా మార్చారు జగన్. ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడితే.. అసలు ఎవరు రాకుండా చేయాలని అనుకుంటున్నారు. పెట్టుబడులు పెట్టే కంపెనీలకు తప్పుడు ఈమెయిల్స్ రాస్తారు. రావొద్దంటారు. ఇన్వెస్టర్లకు ఏపీకి రావొద్దని చెబుతారు. ఇలాంటి ప్రతిపక్షం ఏ రాష్ట్రంలోనూ ఉండదు. రాజకీయం చేయవచ్చు కానీ.. రాష్ట్రాన్ని నాశనం చేయడమే రాజకీయం అనుకునేవారు ఎక్కడా ఉండరు. ఏపీ ప్రజల దౌర్భాగ్యం ఇది.