మొన్న దసరా రోజున అంటే వెలగపూడిలోని తన నూతన కార్యాలయంలో ప్రవేశించేముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాశారు. వచ్చే దసరా నాటికి రాజధాని అమరావతికి పూర్తి రూపం తీసుకువస్తామని అందులో పేర్కొన్నారు. చెప్పాలంటే ఇది ఆయనకు రాజకీయంగానూ తప్పని సరైన ప్రకటన. ఈ ప్రభుత్వం పదవీ కాలం సగం ముగిసింది. మూడేళ్లు పూర్తయితే ఇక ఎన్నికల జ్వరం తథ్యం.అనుభవశాలి గనక చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి, ముఖ్యంగా రాజధాని నిర్మాణం చేయగలరని ఓటర్లు భావించే అవకాశం చాలా వుంటుందని వైసీపీ నాయకులు కూడా ముందునుంచే చెబుతూ వచ్చారు. విచిత్రమేమంటే విమర్శల మధ్యనే భూ సమీకరణకు రైతులు సహకరించినా కేంద్రం దాదాపు 2000 కోట్లు వివిధ రూపాల్లో ఇచ్చినా సింగపూర్‌తో సింక్ కాంట్రాక్టర్లను ఎంపిక బాగా సమయం తీసుకున్నాయి.
వాస్తవానికి సింగపూర్ నుంచి కూడా ఇప్పటికి అందింది శూన్యం. తెలుగుదేశం నాయకులకూ మంత్రులకూ కూడా ఈ విషయంలో తీవ్రమైన అసంతృప్తి వుంది.ఇప్పుడు ప్రభుత్వం తన వంతుగా కార్యాలయాలు శాసనసభ హైకోర్టు రాజ్‌భవన్ కొన్ని క్వార్టర్లు నిర్మిస్తుంది. తద్వారా భూముల విలువ పెరుగుతుందని అంచనా. అప్పుడు సింగపూర్ బాబులు వస్తారు. . ఆ పెరిగిన రేట్లకు తమ వాటా అమ్ముకోవడం మొదలు పెడతారు. వారిది అమ్ముడయ్యేవరకూ మిగిలిన భూమి అమ్మడానికి వుండదు. పైత3 వారికి అనుకున్న ప్రతిఫలం రాకపోతే గడువును పెంచాలి. షరతులు మార్చాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వమే ఏర్పాటుచేయాలి.
ఇచ్చిన భూమికి ప్రతిఫలంగా ప్లాట్లు వచ్చిన రైతులను కూడా అసోసియేషన్లుగా చేర్చి కమర్షియల్ కాంట్రాక్టుల కింద నిర్మాణాలు చేసుకునేలా ప్రోత్సహిస్తారు.కొంతమంది అలా ఇచ్చిన తర్వాత చిన్న చితక ఎలాగూ ఒంటిరి గా చేయలేరు గనక అప్పగించకతప్పదు. పైగా వారినుంచి ఆ ప్టాట్లు కొనుగోలు చేయడం ప్రత్యక్ష పరోక్ష ఒత్తిళ్లతో ఒప్పందాల్లో ఇరికించడం జరగొచ్చు.. ఆ విధంగా రాజధాని రియాల్లీ షో రెండవ ఘట్టం నడుస్తుంది. ఇందులో పాలక పక్ష ప్రముఖులు కనిపించకుండా కథ నడిపిస్తారు. బయిటపడి చెప్పిన వారూ వున్నారు. గతంలో మనం చెప్పుకున్నట్టు మహేష్‌బాబు వంటి సూపర్స్టార్లు కూడా దిగారు.