ప్రపంచ సినిమా పండగ ఆస్కార్ 2026 కు వేదిక సిద్ధం అవుతోంది. మార్చిలో ఆస్కార్ సంబరంభం జరగబోతోంది. ఈలోగా నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. 2026 ఆస్కార్ కోసం పోటీ పడుతున్న చిత్రాల జాబితాను అకాడమీ ఈరోజు ప్రకటించింది. ఈ జాబితాలోని `సిన్నర్స్` అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రేయాన్ కూగ్లర్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం ఏకంగా 16 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకుంది. ఆస్కార్ చరిత్రలో ఇది రికార్డ్. ఇది వరకు ‘ఆల్ అబౌట్ ఈవ్’, ‘టైటానిక్’, ‘లా లా ల్యాండ్ ’ 12 కేటగిరీల్లో నామినేషన్లకు అర్హత సాధించాయి. ఆ రికార్డును ‘సిన్నర్స్’ బద్దలు కొట్టింది. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో భారత్ నుంచి వెళ్లిన `హోంబౌండ్` తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. మార్చి 15వ తేదీన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఉత్తమ చిత్రం కేటగిరీలో ఏకంగా 10 చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఇది కూడా ఓ రికార్డే.
ఉత్తమ చిత్రం విభాగంలో పోటీ పడుతున్న చిత్రాలివే:
బగోనియా
ఎఫ్-1
ఫ్రాంకిన్స్టన్
హ్యామ్నెట్
మార్టీ సుప్రీం
వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
ది సీక్రెట్ ఏజెంట్
సెంటిమెంటల్ వాల్యూ
సిన్నర్స్
ట్రైన్ డ్రీమ్స్
