ఏపీలో నకిలీ మద్యం ముఠాను గుట్టురట్టు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించింది. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ఈ సిట్ ఏర్పాటయింది. సీనియర్ అధికారులు మల్లికా గార్గ్, రాహుల్ దేవ్ శర్మ వంటి సీనియర్ అధికారుల్ని సిట్ లో సభ్యులుగా నియమించారు.
మొదట తంబళ్లపల్లె నియోజకవర్గంలో ములకలచెరువు అనే గ్రామంలో చిన్న ప్లాంట్ పట్టుబడింది. అక్కడ్నుంచి తీగ లాగితే ఆఫ్రికా దాకా బంధాలు బయటపడుతున్నాయి. ఇది చిన్నది కాదని దీని వెనుక చాలా పెద్ద ముఠాలు ఉన్నాయని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటి సంగతి తేల్చాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు దక్షిణాఫ్రికా నుంచిరాగానే అరెస్టు చేశారు. ఆయన ముందస్తుగానే తన ఫోన్ ను పడేసి వచ్చారు. ఇప్పుడు ఆయన లావాదేవీలను వెలికి తీయడానికి ఆయన నెంబర్ తో సిమ్ యాక్టివేట్ చేయించి పూర్తి వివరాలు తెలుసుకోనున్నారు. పైగా అద్దేపల్లి, జయచంద్రారెడ్డి వారు కనిపిస్తున్నా.. దీని వెనుక పెద్ద ముఠా ఉందునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నకిలీ మద్యం అనేది కనిపించకుండా ఉండటానికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ వ్యవస్థను అందుబాటులో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.