మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్ట‌నున్న ‘మ‌నీ’ ద‌ర్శ‌కుడు

వెట‌రన్ ద‌ర్శ‌కులు మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్ట‌డానికి రెడీ అవుతున్నారు. సింగీతం శ్రీ‌నివాస‌రావు ఓ సినిమా చేయ‌డానికి సన్నాహాల్లో ఉన్నారు. ఇప్పుడు శివ నాగేశ్వ‌ర‌రావు కూడా బ‌రిలో దిగుతున్నారు. `మ‌నీ` సినిమాతో పేరు తెచ్చుకున్నారు శివ నాగేశ్వ‌ర‌రావు. సిసింద్రీ, వ‌న్ బై టూ, ప‌ట్టుకోండి చూద్దాం లాంటి హిట్ చిత్రాలు శివ నాగేశ్వ‌ర‌రావు ఖాతాలో ఉన్నాయి. చాలా కాలం త‌ర‌వాత ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న కెప్టెన్ కుర్చీలో కూర్చోబోతున్నారు. గ‌త కొంత‌కాలంగా స్క్రిప్టుల ప‌నిలో ఉన్నారాయ‌న‌. రెండు మూడు క‌థ‌లు రెడీ చేసుకున్నారు. అందులో ఓ క‌థ‌ని ప‌ట్టాలెక్కిస్తున్నారు. శివ నాగేశ్వ‌ర‌రావు రాసిన మ‌రో క‌థ‌తో ఓ ద‌ర్శ‌కుడు సినిమా తీస్తున్నార‌ని స‌మాచారం. అందులో ఓ అగ్ర క‌థానాయ‌కుడు న‌టిస్తార‌ని తెలుస్తోంది. శివ నాగేశ్వ‌ర‌రావుపై హాలీవుడ్ సినిమాల ప్ర‌భావం ఎక్కువ‌. ఈసారి కూడా హాలీవుడ్ ట‌చ్‌లోనే క‌థ‌లు సిద్ధం చేశార‌ట‌. ద‌ర్శ‌కుడిగా, క‌థా ర‌చ‌యిత‌గా శివ నాగేశ్వ‌ర‌రావు చేయ‌బోతున్న సినిమాలేమిట‌న్న‌వి త్వ‌ర‌లోనే తెలుస్తుంది. అంతేకాదు.. ఓ ఓ టీ టీ సంస్థ కూడా వెబ్ సిరీస్ కోసం శివ నాగేశ్వ‌ర‌రావుని సంప్ర‌దించింద‌ని టాక్‌. మొత్తానికి ఓ టీ టీ పుణ్య‌మా అని సీనియ‌ర్ ద‌ర్శ‌కులకూ బోలెడంత ప‌ని దొరుకుతోంది,

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close