ఫిల్మీ ఫెస్టివ‌ల్‌: ఈ సంక్రాంతికి ఆరు సినిమాలా?

2022 సంక్రాంతి చ‌ప్ప‌గా సాగిపోయింది. పెద్ద సినిమాలులేక‌పోవ‌డం, వ‌చ్చిన సినిమాలు ఆడ‌క‌పోవడంతో సంక్రాంతి శోభే లేదు. అయితే 2023 ఇలా కాదు. పెద్ద సినిమాలు ఈసారి హోరెత్తించ‌బోతున్నాయి. బాక్సాఫీసుకి కొత్త క‌ళ తీసుకురాబోతున్నాయి. మ‌రో ఏడు నెల‌లు స‌మ‌యం ఉన్నా స‌రే, ఇప్ప‌టి నుంచే సంక్రాంతి పండ‌క్కి బెర్తుల్ని ఖ‌రారు చేసుకునే ప‌నిలో ప‌డింది చిత్ర‌సీమ‌. 2023 సంక్రాంతికి ప్ర‌స్తుతానికి ఆరు సినిమాలు రేసులో ఉన్న‌ట్టు టాక్‌.

దిల్‌రాజుకి సంక్రాంతి బాగా క‌లిసొచ్చిన సీజ‌న్‌. ప్ర‌తీ సంక్రాంతికి దిల్ రాజు బ్యాన‌ర్ నుంచి ఓ సినిమా క‌చ్చితంగా ఉంటుంది. ఈసారీ… 2023 సంక్రాంతికి ఆయ‌న సంస్థ నుంచి ఓ సినిమా రాబోతోంది. రామ్ చ‌ర‌ణ్ – శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు. మ‌రోవైపు వంశీ పైడిప‌ల్లి- విజ‌య్‌ల‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. నిజానికి ఈ సినిమాని కూడా సంక్రాంతికే ప్లాన్ చేశారు. కాక‌పోతే.. వంశీ ఆ టైమ్‌కి సినిమాని రెడీ చేస్తాడా, లేదా? అనేది అనుమానంగా మారింది. పైగా ఒకే సీజ‌న్‌లో.. రెండు సినిమాల్ని విడుద‌ల చేయ‌డం దిల్ రాజుకి ఇష్టం లేదు. ఈ రెండు సినిమాల్లో మాత్రం ఒక‌టి క‌చ్చితంగా సంక్రాంతికి రావ‌డం ఖాయం.

మ‌హేష్‌కి కూడా సంక్రాంతి సెంటిమెంట్ బాగా ప‌ట్టుకొంది. పండ‌క్కి వ‌చ్చిన మ‌హేష్ సినిమాల‌న్నీ బాగా ఆడాయి. అందుకే 2023 సంక్రాంతిపైనా ఆయ‌న గురి పెట్టారు. మ‌హేష్ – త్రివిక్ర‌మ్ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకురావాల‌ని భావిస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`, చిరంజీవి `భోళా శంక‌ర్‌` ప్ర‌భాస్ `ఆది పురుష్‌`, విజ‌య్ దేవ‌ర‌కొండ `ఖుషి` ఇవ‌న్నీ… సంక్రాంతి ని దృష్టిలో పెట్టుకుని రూపొందుతున్న చిత్రాలే. అయితే.. ఇన్ని సినిమాల‌కు ఛాన్స్ ఉండ‌దు. మూడు సినిమాలైతే ఓకే. కాబ‌ట్టి.. ఈ రేసు నుంచి స‌గం సినిమాలు ప‌క్క‌కు త‌ప్పుకోవాల్సి ఉంటుంది. ధైర్యం చేసి మ‌రో సినిమా వ‌చ్చినా.. ఈ పండ‌క్కి 4 పెద్ద సినిమాల్ని చూడొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రావు ర‌మేష్‌ని కూడా అడ‌గాలా చిరూ…?

ఎంత‌కాద‌న్నా చిరంజీవి మెగాస్టార్‌. ఎవ‌రు అవున్నా.. కాద‌న్నా.. ఇండ‌స్ట్రీకి ఆయ‌నే పెద్ద దిక్కు. చిరుతో క‌లిసి న‌టించాల‌ని, ఆయ‌న‌తో ప‌ని చేయాల‌ని ఎవ్వ‌రైనా కోరుకోవ‌డం స‌హ‌జం. అలాంటిది చిరంజీవే.. 'మీతో క‌లిసి న‌టించాల‌ని...

చిరంజీవికి కిషన్ రెడ్డి ఆహ్వానం – వెళ్లక తప్పుతుందా ?

చిరంజీవి ఆకర్షించేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. భీమవరంలో జరగనున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలకు చిరంజీవి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారికంగా ఆహ్వానించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రధానమంత్రి...

జనసేనాని జనవాణి !

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారంలోకి రాక ముందే ప్రజా సమస్యల పరిష్కారం కోసం నడుం బిగించారు. బాదితులను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోతూండటమే కాదు.. అసలు అర్జీలు కూడా తీసుకోవడం...

మోహన్‌బాబు బీజేపీ మనిషట.. అయితే కోర్టులు సమన్లివ్వకూడదా ?

తాను బీజేపీ మనిషినని మోహన్ బాబు తిరుపతి కోర్టు ఎదుట బహిరంగంగా చెప్పుకున్నారు. ఆయన ఏ పార్టీ మనిషని ఏ మీడియా ప్రతినిధి అడగలేదు. కానీ ఆయనంతటకు ఆయనే చెప్పుకున్నారు. తాను బీజేపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close