ఎస్‌జె సూర్యను ఇప్పుడు యాక్టర్‌గా అభిమానించడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. కానీ ఆయన మంచి ఒరిజినల్ వాయిస్ ఉన్న దర్శకుడు. పవన్ కళ్యాణ్‌కు ఖుషి, అజిత్‌కు వాలి లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ ఆయన. అయితే ఆయన కెరీర్లో ఫ్లాపులు కూడా ఉన్నాయి. మహేష్ బాబుకు ‘నాని’ లాంటి డిజాస్టర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌తో చేసిన పులి కూడా ఫ్లాప్. ఈ సినిమా తర్వాత మళ్లీ దర్శకత్వం వైపు చూడలేదు. నటుడిగా బిజీ అయిపోయారు. యాక్టింగ్‌లో కూడా ఆయనకంటూ ఒక స్టయిల్ ఏర్పడింది.
దాదాపు పదేళ్ల తర్వాత ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టుకున్నారు సూర్య. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ గొకులం మూవీస్ మళ్లీ యాక్టివ్ అయ్యింది. ఒక పాన్ ఇండియా మూవీ చేస్తోంది. ‘కిల్లర్’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రానికి ఎస్‌జె సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. కేవలం దర్శకత్వమే కాదు, ఇందులో ఆయననే హీరో. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ తానే సమకూరుస్తున్నారు. పాన్ ఇండియా సినిమాల్లో నటించడంతో సూర్య పలు భాషల ప్రేక్షకులకు చేరువయ్యారు. ఈ సినిమాను కూడా దాదాపు ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు.