భారత మిహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ స్మృతి మంధాన పెళ్లి మీడియాకు, సోషల్ మీడియాకు ఓ ఆటలా మారింది. పెళ్లి చివరి క్షణంలో వాయిదా పడింది.దానికి కారణం స్మృతి తండ్రి శ్రీనివాస్ కు గుండెపోటు రావడమని అధికారికంగా చెప్పారు. అక్కడ్నుంచే అసలు ఆట ప్రారంభమయింది. మీడియా, సోషల్ మీడియా ఆ పెళ్లి ఇక జరగదని ప్రచారం ప్రారంభించాయి. వారి మధ్య ఇంకేదో జరిగిందని సోషల్ మీడియాలో షో ప్రారంభించారు.
సోషల్ మీడియా ఖాతాల నుంచి వీడియోలు డిలీట్
ఎంగేజ్ మెంట్ నుంచి స్మృతి మంథాన తన పెళ్లిని భిన్నంగా ప్లాన్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు చేసుకున్నారు. ప్రపోజ్ దగ్గర నుంచి ఎంగేజ్ మెంట్ వరకూ డాన్సులతో .. సహచర క్రికెటర్ మిత్రులతో కలిసి బాగానే చేసుకున్నారు. ఆ వీడియోలన్నీ వైరల్ అయ్యాయి. ఇక పెళ్లి వీడియోలు వస్తాయనుకున్న సమయంలో పెళ్లి వాయిదా న్యూస్ బయటకు వచ్చింది. ఆ తర్వాత తన సోషల్ మీడియా ఖాతాల నుంచి పలాష్ తో ఉన్న వీడియోలను మంథాన డిలీట్ చేశారు. ఆమె స్నేహితులు కూడా డిలీట్ చేశారు.
ఇక పెళ్లి ఉండదన్న సంకేతాలు
స్మతిమంథాన, పలాష్ ముచ్చల్ మధ్య పెళ్లి ఇక ఉండదన్న సంకేతాలు వస్తున్నాయి. దీంతో మీడియా, సోషల్ మీడియాలో విపరీతమైన ఊహాగానాలు వస్తున్నాయి. పలాష్ ముశ్చల్ .. ఓ కొరియోగ్రాఫర్ తో ఎఫైర్ నడుపుతూ దొరికిపోయాడని అందుకే స్మృతి మంథాన ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని చెబుతున్నారు. పలాష్ .. స్మృతి తండ్రితో గొడవపడ్డారని .. ఆ గొడవ వల్లనే ఆయన కు గుండెపోటు వచ్చిందని అంటున్నారు. తర్వాత పలాష్ కూడా ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఆస్పత్రి ఎపిసోడ్స్ ఆధారంగా మరిన్ని కథలు వెలుగులోకి వస్తున్నాయి.
ప్రైవసీ కోరుతున్న క్రికెటర్ కుటుంబం
మహిళా క్రికె్టర్లకు.. ప్రపంచకప్ గెలిచిన తర్వాత పెద్ద క్రేజ్ వచ్చింది. ఇక పెళ్లి అంటే చెప్పాల్సిన పని లేదు. పైగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా వీడియోలు తీసుకుని మరీ.. పెళ్లి చేసుకోవాల్సింది… తేడా కొట్టడంతో అందరికీ మరింత ఆసక్తిగా మారింది. ఆ పెళ్లి చుట్టూ ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. అసలు నిజం మాత్రం వారికే తెలుసు. అసలుకు మాత్రం ఏదో జరిగిందని అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది.