పేద కుటుంబం నుంచి వచ్చిన భాస్కర్ రెడ్డి .. ఎలాగోలా లండన్ వెళ్లి..బడ్డీకొట్టో మరొకటో పెట్టుకుని గడుపుతున్నాడు. ఇక్కడ కుటుంబానికి ఎంతో కొంత సాయం చేస్తూ వచ్చాడు. కానీ అతను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో అరెస్టు జైలుకెళ్లాడు. అతను పెట్టిన పోస్టులు చూస్తే ఎవరైనా అతని ముఖాన ఖాండ్రిస్తారు. అలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. ఎందుకు పెట్టారు..ఎలా పెట్టారు అన్నది పక్కన పెడితే.. ఎందుకు పెట్టాల్సి వచ్చింది అన్న తెలివి ఇలాంటి భాస్కర్ రెడ్డిలకు ఉండాలి.
చంద్రబాబుకు.. ఈ భాస్కర్ రెడ్డిలకు ఎలాంటి శత్రుత్వం లేదు. అలాగే లోకేష్, పవన్ కల్యాణ్‌లతో శత్రుత్వం లేదు. మరి ఎందుకు వారిని అలా తిట్టడం.. మార్ఫింగులు చేయడం?. సోషల్ మీడియా కార్యకకర్తనని.. తనకు అలాంటివి పెట్టాలని నిర్దేశించారని.. కంటెంట్ కూడా వారే పంపారని ఆయన చెప్పుకోవచ్చు. అందులో నిజం ఉంటుంది కూడా. కానీ అవి తన జీవితానికి ముప్పు తెచ్చి పెడతాయనే తెలివితేటలు ఆయనకు ఉండదా?. ఇవాళ కాకపోతే రేపైనా తన పరిస్థితి తేడాగా మారుతుందని.. అది జీవితాలను తలకిందులు చేస్తుందని గుర్తించలేరా?.
జగన్ అండ్ గ్యాంగ్ అత్యంత స్వార్థపరులు. కులాభిమానంతో ఉండేవారిని బలి పశువులు చేయాలనుకుంటారు. అసలు చంద్రబాబు, పవన్,లోకేష్, భువనేశ్వరి వంటి వారిపై బూతు పోస్టులు పెట్టడం రాజకీయం ఎలా అవుతుంది?. కేవలం తమ అధినేతకు ఉన్న ఓ మానసిక వికృతాన్ని సంతృప్తి పరచడానికి ఇలాంటి పనులు చేయించారు. చివరికి అలాంటి వారందర్నీ జైలు పాలు చేశారు. జీవితాలను నాశనం చేశారు. ఇలా అవుతుందని అంచనా వేయలేకపోవడం ఈ భాస్కర్ రెడ్డిల తప్పే. జగన్ రెడ్డిని గుడ్డిగా నమ్మడం.. అవసరం లేకపోయినా కులం పేరుతో ఇతరుల్ని ద్వేషించాలనే జగన్ రెడ్డి ట్రాప్ లో పడటం వీరి తప్పే. దానికి అనుభవిస్తున్నారు.
ఇది జగన్ పార్టీకే కాదు.. టీడీపీకైనా వర్తిస్తుంది. భారతిపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని వెంటనే టీడీపీ కార్యకర్తను అరెస్టు చేశారు. ఆయనను అరెస్టు చేయకపోతే అదే ప్రోత్సాహం అనుకుని చాలా మంది మాట్లాడేవారు. ఎవరూ ఇక అలా మాట్లాడకూడదని ఓ కరుడు గట్టిన కార్యకర్తను శిక్షించింది టీడీపీ. ఇతరు కార్యకర్తల జీవితాలు భాస్కర్ రెడ్డిలా కాకుండా కాపాడింది.కానీ వైసీపీ ఇంకా ఇంకా ప్రోత్సహిస్తుంది. అందుకే వైసీపీ బలిపశువుల్ని చేస్తుందని..సోషల్ మీడియా కార్యకర్తలు ఇప్పటికైనా గ్రహించాలి. వారి కుట్రలకు బలి కాకుండా జాగ్రత్తపడాలి.
