ఎడిటర్స్ కామెంట్స్ : రాజకీయాలకు శాపం స్ట్రాటజిస్టులు !

కడివెడు పాలను చెడగొట్టడానికి..విషపూరితం చేయడానికి చుక్క విషం చాలన్నట్లుగా … వందల పార్టీలు.. వేల మంది నాయకులతో విస్తరించిన రాజకీయాన్ని ఒకే ఒక్క స్ట్రాటజిస్ట్ విషపూరితం చేశారు. రాజకీయాలంటే కుట్రలు, కుతంత్రాలు అని నిన్నామొన్నటిదాకా అనుకునేవారు. కానీ ఇప్పడు అంతకు మించి అని.. సోషల్ మీడియా పుణ్యమా అని పుట్టుకు వచ్చిన వ్యూహకర్తలు చెలరేగిపోతున్నారు. పీకే షార్ట్ కట్‌లో తెచ్చుకున్న.. తెచ్చి పెట్టిన విజయాలు చూసి.. ఆయననకు మించిన వారు రంగంలోకి వచ్చారు. ఫలితంగా ఇప్పుడు రాజకీయం విషపూరితం అవుతోంది. ఇప్పుడు హత్యలు అంటే నేరుగా చేయాల్సిన పని లేదు. మానసికంగా చేయవచ్చు. ఎదుటి వారి వీక్‌నెస్‌ను పట్టుకుని దానిపై సోషల్ మీడియా ద్వారా దెబ్బకొడితే చాలు. టార్గెట్ చేసిన వాడు మానసికంగా కుంగి కృశించి పోయి… ప్రాణాలు పోగొట్టుకుంటాడో.. ఆత్మహత్య చేసుకుంటాడో వాడిష్టం అన్నట్లుగా మార్చేయవచ్చు. ఇందు కోసం కోట్లు ఖర్చు పెట్టి.. సోషల్ మీడియా వారియర్స్ పేరుతో రాజకీయ పార్టీలు సైన్యాలను నడుపుతూ ఉంటాయి. ఎక్కడిక్కడ ఫలానా లీడర్‌ను ఎలా దెబ్బకొట్టాలి..అనే దానిపై స్ట్రాటజిస్టులను పెట్టుకుని ఎప్పటికప్పుడు తాము టార్గెట్ చేయాల్సిన నేతలను ఎలా .. వేధించాలో పక్కా ప్లాన్ ప్రకారం రెడీ అయిపోతున్నారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడీ ఉదంతం బహిరంగంగా జరుగుతోంది. కానీ అక్కడ విషయం ఏమిటంటే.. స్ట్రాటజిస్టుల్ని పెట్టుకుని.. డబ్బులు ఖర్చు పెట్టుకోగల అన్ని పార్టీలూ అదే చేస్తున్నాయి. ఒకరి ప్రత్యర్థుల్ని మరొకరు మానసికంగా వేధించేందుకు పెద్ద పెద్ద యుద్ధాల్నే చేస్తున్నాయి. ఇదంతా ఎవరి వికృతం. ఖచ్చితంగా స్ట్రాటజిస్టులదే ఈ పాపం. వారి వల్లే ఇప్పుడీ పరిస్థితి. రాజకీయ నేతలు వారిని నమ్మి.. తమను నష్టపరుచుకోవడమే కాకుండా తమ కుటుంబాలనూ రోడ్డుకు ఈడ్చుకుంటున్నారు.

సిద్ధాంతాల్లేవు.. రాద్దాంతాలే రాజకీయ పార్టీ బలం !

ఏ రాజకీయ పార్టీకైనా బలం సిద్ధాంతం అని ఇప్పుడు ఎవరైనా చెబితే వారి వైపు పిచ్చి వాడిని చూసినట్లుగా చూస్తారు. రాజకీయాల్లో సిద్ధాంతాలు కాలగమనంలోకి కలసిపోయి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు ఏ పార్టీకైనా బలం ఏమిటి అంటే.. సోషల్ మీడియా అని చెప్పే పరిస్థితి వచ్చింది. అధినేతకు ఎంత ప్రజాదరణ ఉన్నా.. కింది స్థాయి నుంచి పార్టీకి నాయకత్వం ఉన్నా .. సోషల్ మీడియా బలంగా లేకపోతే గెలుపు కష్టమేననే పరిస్థితి వచ్చింది. అందుకే రాజకీయ పార్టీలు ఇప్పుడు సోషల్ మీడియా మీద దృష్టి పెట్టాయి. వెనుకబడిపోతున్నామని అనిపిస్తే చాలు వెంటనే ఖర్చుకు వెనుకాడకుండా బలం పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా ఇంచార్జ్‌ను జగన్ మార్చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డిని పక్కన పెట్టి .. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డికి ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ పేరుతో ప్రత్యేకంగా సోషల్ మీడియా విభాగం నడుపుతోంది. దాన్ని చింతకాయల విజయ్ పర్యవేక్షిస్తూంటారు. ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఆన్ లైన్ వేదికగా సాగుతున్న బూతుల పరంపర.. వ్యక్తిత్వ హననాల యుద్ధం వంటివి చూస్తే ఎవరికైనా సోషల్ మీడియా ఎంత ప్రమాదకరమో అర్థం అయిపోతుంది.

ప్రత్యర్థుల్ని మానసికంగా హత్య చేసేందుకు సైన్యాల ప్రయోగం !

సోషల్ మీడియా ద్వారానే ఇప్పుడు చాలా పనులు జరుగుతున్నాయి. ఈ వేదిక ద్వారా ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. యువత మీద సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. దీన్ని రాజకీయ పార్టీలు గట్టిగానే పట్టుకున్నాయి. ప్రత్యేకంగా సోషల్ మీడియా సైన్యాలను ఏర్పాటు చేసుకుని ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ ప్రచారాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడం.. రెండు.. ప్రత్యర్థులను ట్రోల్ చేయడం. సోషల్ మీడియాలో నెగెటివిటీ ఎక్కువ. పాజిటివ్ అంశాలకు ప్రాధాన్యం లభించదు. కానీ నెగిటివ్‌గా ఏదైనా ఉంటే మాత్రం వైరల్ అయిపోతుంది. ఈ టెక్నాలజీ మార్పులను రాజకీయ పార్టీలు బాగా ఉపయోగించుకుంటున్నాయి. సాధారణంగా సోషల్‌ మీడియాకు ఎక్కువగా అనుసంధానంలో ఉండేది యువతే. మన దేశంలో దాదాపు 50 కోట్ల మంది 15 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసులోపు వారు ఉన్నారు. సోషల్‌ మీడియాను వాడేది వారే కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. సోషల్‌ మీడియా విభాగంలో ప్రత్యేకంగా ఉద్యోగులు, అభిమానుల కోసం ఆర్మీలు స్థాపిస్తున్నాయి. తమ నేతలను సోషల్‌ మీడియాలో ప్రమోట్‌ చేసేందుకు, ఎదుటి పార్టీపై కామెంట్లు, ట్వీట్లతో విమర్శలు గుప్పించేందుకు నకిలీ ఖాతాలను కూడా ఈ ఆర్మీ విభాగాలు నిర్వహిస్తున్నాయి. ప్రతి కామెంట్, లైక్‌కు కూడా పార్టీలు డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ కారణంగా తప్పుడు ప్రచారాలకు.. హేట్ స్పీచ్‌లకు సోషల్ మీడయా కేంద్రంగా మారింది. విద్వేషాలు రగిల్చేలా, ఇతరులను కించపరిచేలా, పరువుకు భంగం వాటిల్లేలా, శాంతిభద్రతలకు చేటు తెచ్చే పోస్టులను పోలీసులు ఉపేక్షించరు. ఏపీలో న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని సీబీఐ అరెస్ట్ చేస్తోంది. అది సీబీఐ చేతికి వెళ్లింది కాబట్టే అరెస్టులు. ఇతర వ్యక్తిత్వ హనన పోస్టులు.. మహిళల్ని దారుణంగా కించ పర్చడం వంటి వాటిపై ఏపీలో చర్యలు ఉండవు. ఓ పార్టీ వాళ్లు ఎన్నైనా చేయవచ్చు. కానీ మరొకరు అలా అంటే మాత్రం అరెస్ట్ చేసేస్తారు.

అధినేతల కుటుంబాలే ఆన్ లైన్‌లో అల్లరవుతున్నాయి… కానీ గుర్తించలేకపోతున్నారు !

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉంటాయి. ఆఫ్ లైన్ ఆయినా ఆన్ లైన్ అయినా తిట్లు, శాపనార్థాలు కామన్. మీడియా ముందే దారుణంగా మాట్లాడుతూంటారు.. ఇక సోషల్ మీడియాలో ఊరుకుంటారా ?. వీరికి ఆయా రాజకీయ పార్టీల ముఖ్య నేతల మద్దతు కూడా ఉండటంతో చెలరేగిపోతున్నారు. తప్పుడు ప్రచారాలు.. ఆరోపణలు చేయడానికి ప్రత్యేకంగా ట్రెండింగ్‌లు నిర్వహించడం కామన్ అయిపోయింది. ఈ సోషల్ మీడియా ప్రచారాలు తమకు మేలు చేస్తారని రాజకీయ పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లుగా.. అతిగా మారినప్పుడు రివర్స్ అవుతుంది. ఇప్పుడా స్టేజ్‌ వచ్చేసినట్లుగానే అనిపిస్తోంది. ఎవరూ ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. ఇక్కడ విషయం ఎమిటంటే.. ఎవరి బట్టలు వాళ్లు ఊడతీసుకోవడమే కాదు.. ఎటు వారి నగ్నత్వాన్ని కూడా చూపించేస్తున్నారు. వారి అసలు రూపం చూడలేక ట్విట్టర్‌లో బుద్ది జీవులు హడలి పోతున్నారు. దీన్ని రాజకీయం అనరని..ఇలాంటి సంస్కార హీనత్వానికి ఇంకా పేరు పెట్టలేదని అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో వికృతాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే మంచిది. కానీ అక్కడ బద్నాం అవుతోంది మాత్రం ఇలా సోషల్ మీడియా సైన్యాల కుటుంబాలు కాదు. అధినేతల కుటుంబాలే. ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉంటాయి. అందులో మహిళలు ఉంటారు. పిల్లలు ఉంటారు. వారికి రంకులు అంటగడతూ పోస్టులు పెట్టుకునే దౌర్భగ్య సోషల్ మీడియా స్ట్రాటజీలు వచ్చాయి. మేము ఒకటి అంటే వాళ్లు రెండు అంటారనే కనీస ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయారు. తమ తమ సైన్యాలను కంట్రోల్ చేయడం లేదు. ఇంకా ప్రోత్సహిస్తున్నారు. పరిస్థితి ఎలా ఉందంటే చివరికి మార్ఫింగ్ ఫోటోలు కూడా విడుదల చేసుకుంటున్నారు. వాళ్లు అన్నారని మేము రెండు అంటాం అని రెండు పార్టీలనేతలు చెలరేగిపోతున్నారు. నిజానికి వాళ్లకెవరకీ బాధ్యత లేదు. వైసీపీ వాళ్లనంటే టీడీపీ వాళ్లకు వచ్చే లాభం లేదు.. టీడీపీ వాళ్లను బూతులు తిడితే వైసీపీ వాళ్లు వచ్చేది లేదు. రెండు పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు అత్యధికులు పెయిడ్. అభిమానంతో పని చేసే వారెవరూ ఇంతకు దిగజారరు.

రాజకీయాలకు శాపం స్ట్రాటజిస్టులు !

సోషల్ మీడియాను పద్దతిగా వాడుకుంటే ఎంతో సంప్రదాయంగా ఉంటుంది. ఓటర్లతో రాజకీయ పార్టీలు ఈజీగా ఇంటరాక్ట్ కావచ్చు. తాము చెప్పదలచుకున్న విషయాన్ని తక్కువ ఖర్చుతో, తక్కువ టైంలో చాలా వేగంగా ఎక్కువ మందికి పొలిటికల్ లీడర్లు చెప్పే అవకాశం సోషల్ మీడియా కల్పిస్తోంది. ఒకప్పుడు ప్రచారమంటే సభలు, ర్యాలీలు, కరపత్రాల పంపిణీతో ఊళ్లు హోరెత్తిపోయేవి. కానీ కాలం మారింది. సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత రాజకీయ రంగస్థల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. వాట్సాప్, ఫేస్‌బుక్‌ల పుణ్యమా అని రాజకీయ పార్టీలు నిత్యం ప్రజలతో నేరుగా అనుసంధానంలో ఉండగలుగుతున్నాయి. రాజకీయ వేదికల నుంచి నాయకుల సందేశాలు నేరుగా ప్రజల ఫోన్లకు చేరిపోతున్నాయి. డిజిటల్‌ సాంకేతికత, స్మార్ట్‌ఫోన్ల హవా, కారుచౌకగా ఇంటర్నెట్‌ డేటా అందుబాటులోకి రావడంతో సామాన్యులంతా ఈ సౌకర్యాలను ఉపయోగించుకుంటున్నారు. ఈ సాంకేతికత వేదికగానే ఇప్పుడు రాజకీయ రంగస్థలం నడుస్తోంది. కానీ మంచి పొలంలో కలుపు మొక్కలు వచ్చినట్లుగా ఎప్పుడైతే స్ట్రాటజిస్టులు అడుగుపెట్టారో అప్పుడే వినాశనానికి నాంది పలికింది. ప్రత్యర్థుల్ని చిత్తు చేయడం.. వారిపై తప్పుడు ప్రచారాలు చేయడం.. మానసికంగా వేధించడం వంటి వ్యూహాల కోసం సోషల్ మీడియాను అడ్డదిడ్డంగా వాడేసుకున్నారు. అది ఇ్పపుడు పీక్స్‌కు చేరిపోయింది. ఎంత తీవ్ర స్థాయికి చేరిందంటే.. ఏదైనా కళ్ల ముందు జరిగిందంటే.. జనం నమ్మరు. కానీ వాట్సాప్‌లో వచ్చిందంటే.. అది జగలేదని.. మన కళ్లతో చూశామని చెప్పినా కూడా నమ్మరు. ఆ స్థాయిలో మన బుర్రల్ని ఖరాబు చేస్తున్నారు స్ట్రాటజిస్టులు.

తప్పు చేసేది వాళ్లయినా.. చేయిస్తోంది రాజకీయమే !

స్ట్రాటజిస్టుల తప్పుడు ఆలోచలను తాత్కాలిక విజయం కోసం ప్రోత్సహించే రాజకీయ నాయకులదే అసలుతప్పు. అధికారం అందుకోవాలని.. లేని అధికారాన్ని అందుకోవాలని .. ఎలాంటి మార్గమైన సరే అనుకుని ముందుకెళ్లే రాజకీయ నాయకులతోనే సమస్య. రాజకీయానికి పట్టిన వైరస్ కూడా అదే. రాజకీయాలు పతనం ఇప్పుడే ప్రారంభమైందని అనుకోవాలి. ఎందుకంటే బాధలు పడుతున్న వారి చేతికి అధికారం వస్తే.. అంతకు మించి చేస్తారు. అప్పుడు మరింత పతనం అవుతుంది. అది సమాజానికి మంచిది కాదు. ఇప్పటికే నష్టం జరిగిపోయింది. ఇప్పటి వరకూ జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేం. ఇప్పుడు ఆపే స్టేజి కూడా దాటిపోయింది. ఇక ఈ స్ట్రాటజిస్టులు వేసిన విషబీజాలు దేశాన్ని ఏ దుస్థితికి నెట్టేస్తాయో ఎదురు చూస్తూ ఉండటమే మిగిలింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close